అమ్మకానికి డ్రెడ్జింగ్ కార్పొరేషన్

Fri,November 9, 2018 12:36 AM

Centre to sell its entire stake in Dredging Corporation

ప్రభుత్వ వాటా ఉపసంహరణకు క్యాబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ, నవంబర్ 8: ప్రభుత్వ రంగ సంస్థ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డీసీఐఎల్) అమ్మకానికొస్తున్నది. ఇందులోని ప్రభుత్వ వాటా వ్యూహాత్మక విక్రయానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. గురువారం ఇక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రి మండలి.. డీసీఐఎల్ వాటాను నాలుగు పోర్టుల కూటమికి విక్రయించేందుకు అంగీకరించింది. డీసీఐఎల్‌లో ప్రస్తుతం కేంద్రానికి 73.44 శాతం వాటా ఉన్నది. ఈ క్రమంలోనే ఈ మొత్తం వాటాను విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్, పారదీప్ పోర్ట్ ట్రస్ట్, జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్, కండ్లా పోర్ట్ ట్రస్ట్‌కు అమ్మేందుకు ఆర్థిక వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) సూత్రప్రాయ అనుమతిని వ్యక్తం చేసింది.

ఇదిలావుంటే ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని అహ్మదాబాద్, జైపూర్, లక్నో, గౌహతి, తిరువనంతపురం, మంగళూరు విమానాశ్రయాలను ప్రభుత్వ, ప్రైవేట్ రంగ భాగస్వామ్యంలో నిర్వహించే ప్రతిపాదనకు క్యాబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇక కర్నాటకలోని పాడూరులోగల వ్యూహాత్మక భూగ ర్భ చమురు నిల్వ బంకర్‌ను దేశీయ ఇంధన అవసరాల నిమిత్తం విదేశీ చమురు కంపెనీలు వాడుకునేందుకూ అనుమతినిచ్చింది. అలాగే బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్, బీబీఎన్‌ఎల్ ఆర్డర్లలో ఐటీఐ లిమిటెడ్‌కున్న 30 శాతం రిజర్వేషన్‌ను కొనసాగించాలన్న టెలికం శాఖ ప్రతిపాదనకూ క్యాబినెట్ ఓకే చెప్పింది.

644
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles