మణుగూరులో సెలెక్ట్ స్టోర్

Tue,May 14, 2019 12:42 AM

Celekt Mobile Store in Manuguru

-భారీ ఎత్తున ప్రారంభోత్సవ ఆఫర్లు

హైదరాబాద్, మే 13: ప్రముఖ మొబైల్ రిటైల్ సంస్థ సెలెక్ట్.. మణుగూరులో తమ నూతన స్టోర్‌ను ప్రారంభించింది. స్థానిక డీఎస్పీ సాయిబాబా చేతులమీదుగా మొదలైన ఈ స్టోర్‌లో ప్రారంభోత్సవ ఆఫర్‌లో భాగంగా బిల్లుకు సమాన స్థాయిలో క్యాష్‌బ్యాక్, ఉచిత మొబైల్ ఫోన్లు, యాక్ససరీస్ అందుకోవచ్చని సంస్థ ప్రకటించింది. ఎక్సేంజ్ ఆఫర్ కింద పాత ఫోన్‌ను మార్చుకుని సరికొత్త ఫోన్‌ను పొందవచ్చని, 2జీబీ ధరకే 4జీబీ స్మార్ట్‌ఫోన్ లభిస్తుందని, సీ-సేఫ్ ద్వారా మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్, ఎక్స్‌టెండెడ్ వారెంటీని అందిస్తున్నామని సెలెక్ట్ ప్రతినిధి నవీన్ ఈ సందర్భంగా తెలిపారు. రూ.16,999 విలువగల మోటో జీ6పై, రూ.6,999 విలువగల మొబైల్ కొనుగోలుపై అంతే మొత్తంలో క్యాష్‌బ్యాక్, రూ.1,099 విలువగల మొబైల్ కొనుగోలుపై అంతే విలువైన ఫోన్ ఉచితంగా తీసుకోవచ్చన్నారు. రూ.4,999 విలువగల మొబైల్ కొనుగోలుపై 50 శాతం క్యాష్‌బ్యాక్ ఉంటుందని వివరించారు. ఇక యాక్ససరీస్ ఎంత కొంటే అంతకు సమానమైన విలువలో ఉచితంగా పొందవచ్చని స్పష్టం చేశారు. కాగా, ప్రస్తుతం రెండు తెలుగు రాష్ర్టాలు, మహారాష్ట్రలో కలిపి 55 సెలెక్ట్ స్టోర్లున్నాయన్న ఆయన ఈ ఏడాది చివరికల్లా 100 స్టోర్లకు విస్తరిస్తామని ప్రకటించారు.

597
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles