ఫైర్‌స్టార్ సీఎఫ్‌వోను ప్రశ్నించిన సీబీఐ


Tue,March 13, 2018 01:57 AM

జతిన్ మెహతా సహచరుడి అరెస్టు
న్యూఢిల్లీ, మార్చి 12: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)లో భారీ కుంభకోణానికి పాల్పడి రూ.12,700 కోట్లు కొల్లగొట్టిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీపై నమోదైన రూ.321.88 కోట్ల రుణ ఎగవేత కేసులో ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్‌బీ)లకు చెందిన ఉన్నతాధికారులపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దృష్టి కేంద్రీకరించింది. ఈ కేసులో నిందితునిగా ఉన్న నీరవ్ మోదీ కంపెనీ ఫైర్‌స్టార్ డైమండ్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సీఎఫ్‌వో రవి శంకర్ గుప్తాను సీబీఐ సోమవారం ప్రశ్నించింది. బ్యాంకు రుణాలు ఎలా మంజూరయ్యాయి, వాటిని ఏవిధంగా దారి మళ్లించారు, ఈ వ్యవహారాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల ప్రమేయం ఏమేరకు ఉందన్న ప్రశ్నలతో రవి శంకర్ గుప్తాను సీబీఐ ఉక్కిరి బిక్కిరి చేసినట్లు ఒక అధికారి వెల్లడించారు. ఇదిలావుంటే, విన్సమ్ డైమండ్ సంస్థపై దాఖలైన మరో రుణ ఎగవేత కేసులో ఆ సంస్థ చీఫ్ జతిన్ మెహతాకు సన్నిహితుడైన హస్ముఖ్‌ను సీబీఐ అరెస్టు చేసింది.

266

More News

VIRAL NEWS