ఐబీసీ కింద మైక్రో రుణాల రద్దు!

Mon,August 19, 2019 03:10 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 18: మైక్రో ఫైనాన్స్ రుణ గ్రహీతలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభు త్వం నడుం బిగించింది. దివాలా చట్టం (ఐబీసీ) కింద వీరి రుణాలను రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్ వివరాల ప్రకారం ఈ మేరకు మైక్రో ఫైనాన్స్ (సూక్ష్మ రుణాలు) సంస్థలతో చర్చలు జరుగుతున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఈడబ్ల్యూఎస్)కు చెందిన రుణ గ్రహీతలకు సాయం అందించేందుకే ఇదంతా అని ఆయ న చెప్పారు. కాగా, ఫ్రెష్ స్టార్ట్ పేరుతో తెస్తున్న ఈ రుణాల రద్దులో ఒకసారి లబ్ధి పొందినవారు ఐదేండ్లదాకా మళ్లీ ఆ సా యాన్ని అందుకోలేరన్నారు. మూడు, నాలుగేండ్లలో జాతీయ స్థాయిలో రూ.10 వేల కోట్లకు మించకుండా రుణాల రద్దు చేసే వీలుందని శ్రీనివాస్ తెలిపారు.

229
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles