ఈ-కామర్స్‌పై సీఏఐటీ ఆందోళనలు

Mon,November 11, 2019 03:31 AM

న్యూఢిల్లీ, నవంబర్‌ 10: అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ తదితర ఈ-కామర్స్‌ సంస్థలకు వ్యతిరేకంగా ఆందోళనలను ప్రారంభిస్తామని వాణిజ్య సంఘం సీఏఐటీ తెలిపింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానం నిబంధనలకు ఆన్‌లైన్‌ కంపెనీలు తూట్లు పొడుస్తున్నాయని అఖిల భారత వర్తక సమాఖ్య (సీఏఐటీ) ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ ఖండేల్వాల్‌ అన్నారు. ఈ క్రమంలోనే బుధవారం నుంచి తమ నిరసనల్ని చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. సీఏఐటీ ఆధ్వర్యంలో ఆదివారం ఇక్కడ జరిగిన జాతీయ వర్తకుల సదస్సుకు దేశవ్యాప్తంగా 27 రాష్ర్టాలకు చెందిన ట్రేడ్‌ లీడర్లు హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఖండేల్వాల్‌ మాట్లాడుతూ 13 నుంచి మొదలయ్యే ఆందోళనలు.. వచ్చే ఏడాది జనవరి 10 వరకు కొనసాగుతాయన్నారు. ఈ నెల 20న ‘జాతీయ నిరసన దినం’ను నిర్వహిస్తామని, ఇందులో భాగంగానే 500 నగరాల్లో ధర్నాలు చేపడుతామని ప్రకటించారు. ఈ నిరసనల్లో దాదాపు 5 లక్షల మంది వ్యాపారులు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. జనవరి 9న ఇతర భాగస్వాములతో కలిసి సీఏఐటీ జాతీయ పాలక మండలి సమావేశం జరుగుతుందని, రెండో దశ ఆందోళనకు సంబంధించి కార్యాచరణను నిర్ణయిస్తామని అన్నారు.

116
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles