కొనుగోలుదారులే డెవలపర్లను నిలదీయాలి!

Sat,January 12, 2019 11:46 PM

Buyers should stand up to developers!

రెరా రిజిస్ట్రేషన్ నంబర్ తెలుసుకున్నాకే ప్లాట్లు, ఫ్లాట్లను కొనాలి
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ రంగంలో పారదర్శకత నెలకొల్పడానికి ప్రయత్నిస్తుంటే.. కొందరు రియల్టర్లు రెరా అనుమతి తీసుకోకుండానే ప్లాట్లను విక్రయిస్తున్నారని రెరా అథారిటీ దృష్టికి వచ్చిం ది. అలాంటి ప్రాజెక్టుల్లో ప్లాట్లు, ఫ్లాట్లు కొనేవారు ముందుచూపుతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. రెరా వద్ద నమోదు చేయకుండా ప్లాట్లు, ఫ్లాట్లను విక్రయించే డెవలపర్లపై కఠిన చర్యల్ని తీసుకుంటామని తెలంగాణ రెరా అథారిటీ హెచ్చరించింది. ఒకవేళ డెవలపర్లు రెరా అనుమతి లేకుండా ప్లాట్లు, ఫ్లాట్ల అమ్మకానికి పెడితే.. వాటిలో కొనడానికి నిరాకరించాలని సూచించింది. సదరు రియల్టర్‌ని రెరాలో రిజిస్టర్ చేసుకునేలా ప్రోత్సహించాలని కోరుతున్నది. ప్లాట్లు, ఫ్లాట్లు కొనే ప్రతిఒక్కరూ రెరా రిజిస్ట్రేషన్ నంబర్‌ని డెవలపర్ వద్ద అడిగి తెలుసుకోవాలని రెరా అథారిటీ తెలియజేసింది. తమ కష్టార్జితం బూడిదపాలు కాకూడదని భావించే ప్రతిఒక్కరూ.. ప్లాటు లేదా ఫ్లాటు కొనేటప్పుడు.. rera.telangana.gov.inలో అట్టి ప్రాజెక్టు రిజిస్టర్ అయ్యిందా? లేదా? అనే విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాలని సూచించింది. అప్పుడే, స్థిర నివాసానికి సంబంధించి తుది నిర్ణయం తీసుకోవాలని అంటున్నది. వాణిజ్య భవనాలు, మిక్స్‌డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుల్ని కట్టేవారు రెరాలో రిజిస్టర్ చేసుకోవాలని అభ్యర్థించింది.

595
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles