బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల సమ్మె

Tue,February 19, 2019 12:22 AM

హైదరాబాద్‌లో సమ్మె చేస్తున్న బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులు
న్యూఢిల్లీ/హైదరాబాద్,ఫిబ్రవరి18: ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులు సమ్మె బాటపట్టారు. సోమవారం ప్రారంభమైన ఈ సమ్మె మూడు రోజుల పాటు బుధవారం వరకు కొనసాగనున్నదని ఉద్యోగ సంఘాలు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా యూనియన్స్ అండ్ అసోసియేషన్స్ ఆఫ్ భారత్ సంచార్ నిగామ్ లిమిటెడ్(ఏయూఏబీ) కన్వీనర్ పీ అభిమన్యు మాట్లాడుతూ..సంస్థను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రైవేట్ టెలికం సంస్థలకు లాభం చేకూరుతున్నదని విమర్శించారు. ప్రైవేట్ పోటీ సంస్థలకు ధీటుగా సేవలు అందించాలంటే ముందుగా 4జీ సర్వీసులు అందించడానికి అవసరమైన స్పెక్ట్రంను కేటాయించాలని, భూ నిర్వహణ పాలసీని అనుమతించాలని ఆయన డిమాండ్ చేశారు. వీటితోపాటు సిబ్బంది వేతనాలు, పెన్షన్ సర్దుబాటు చేసుకునే అవకాశం కల్పించాలన్నారు. ఫిబ్రవరి 1నే ఈ సమ్మె నోటీసు జారీ చేసినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఎలాంటి కదలిక రాలేదని, ముఖ్యంగా ఉద్యోగ సంఘా ల నేతలను చర్చలకు కూడా పిలువలేదని ఆయన దుయ్యబట్టారు. ఇతర టెలికం సంస్థ ల కంటే బీఎస్‌ఎన్‌ఎల్‌కు చాలా తక్కువగా రూ.13 వేల కోట్లు మాత్రమే అప్పు ఉన్నదని, వొడాఫోన్ ఐడియాకు రూ.1.2 లక్షల కోట్లు ఉంటే, ఎయిర్‌టెల్‌కు రూ.1.06 లక్షల కోట్లు ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. కాగా, హైదరాబాద్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ ప్రధాన కార్యాలయం ముందు ఉద్యోగులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా నాయకులు రవికుమార్, కేరాజు, కోటేశ్వరరావులు మాట్లాడుతూ.. బీఎస్‌ఎన్‌ఎల్ ను ఉద్ధేశపూర్వకంగానే నష్టాలు చూపుతు నిర్విర్యం చేయాలని చేస్తున్నారని ఆరోపించారు. 2017 నుంచి అమలు చేయాల్సిన వేతన, పెన్షన్ సవరణను ఉద్యోగ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడం లేదన్నారు. సంస్థను ముక్కలుగా చేసి ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని వారు ఆరోపించారు.

987
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles