బ్రిటన్ కుబేరుల్లో భారతీయుల సత్తా

Mon,May 13, 2019 12:12 AM

Britains wealthiest Hinduja brothers return to top of UK rich list Lakshmi Mittal slips six spots

-22 బిలియన్ పౌండ్లతో హిందుజా బ్రదర్స్ టాప్
-రెండో స్థానంలో ర్యూబెన్ సోదరులు

లండన్, మే 12: భారత సంతతికి చెందిన శ్రీమంతులు విదేశాల్లో సత్తాచాటుతున్నారు. బ్రిటన్‌లో ఉన్న కుబేరుల్లో 22 బిలియన్ పౌండ్ల సంపాదనతో హిందుజా బ్రదర్స్ తొలి స్థానం దక్కించుకున్నారు. అలాగే ముంబైలో జన్మించిన ర్యూబెన్ సోదరులకు ఈ తర్వాతి స్థానం వరించింది. వీరి సంపాదన విలువ 18.66 బిలియన్ పౌండ్లు. బ్రిటన్‌లో గడిచిన కొన్ని సంవత్సరాలుగా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న శ్రీ, గోపిచంద్ హిందుజా సంపాదన అంతక్రితం ఏడాదితో పోలిస్తే 1.35 బిలియన్ పౌండ్లు పెరిగింది. ఈ విషయాన్ని సండే టైమ్స్ రిచ్ లిస్ట్ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. 2014, 2017లోనూ హిం దుజా బ్రదర్స్ తొలిస్థానంలో నిలిచారు. ప్రస్తుతం హిందుజా సోదరులు బ్రిటన్‌లో నివసించకపోయినప్పటికీ.. గోపి హిందుజాకు చెందిన కుటుంబ సభ్యు లు అక్కడే నివసిస్తున్నారు. 79 ఏండ్లక్రితం ఏర్పాటైన హిందుజా సంస్థలకు జీపీ హిందుజా కో-చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. లండన్ కేంద్రస్థానంగా ప లు వ్యాపారాలు నిర్వహిస్తున్న హిందుజా బ్రదర్స్‌లో శ్రీ(83), ప్రకాశ్(73), అశోక్(68)లు జెనీవా, ముంబైలలో నివసిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా ఉన్న హిందుజా గ్రూపు కంపెనీలకు గడిచిన సంవత్సరానికిగాను 40 బిలియన్ పౌండ్ల వార్షిక టర్నోవర్ లభించింది.

హిందువు భక్తులుగా ముద్ర పడిన ఈ హిందుజా బ్రదర్స్..ఆయిల్, చమురు, ఐటీ, ఇంధనం, మీడియా, బ్యాంకింగ్, స్థిరాస్తి, ఆరోగ్య రంగాల్లో తమదైన ముద్రవేశారు. కానీ మాంసం, అల్కాహాల్ విభాగాల్లోకి ప్రవేశించలేదు. 2017-18 ఆర్థిక సంవత్సరానికిగాను లండన్ స్టాక్ మార్కెట్లో రిజిస్టార్ అయిన హిందుజా ఆటోమోటివ్ సంస్థ 337 మిలియన్ పౌండ్ల లాభాన్ని, 3.5 బిలియన్ పౌండ్ల విక్రయాలను సాధించింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 50 శాతం వృద్ధి కనబరిచింది. మరోవైపు ముంబైలో జన్మించిన ర్యూబెన్ సోదరులైన డేవిడ్(80), సిమన్(77)లు స్థిరాస్తి, ఇంటర్నెట్ వ్యాపారాల్లో సత్తా చాటుతున్నారు. బర్లింగ్టన్ అర్కేడ్, షోరిడిచ్స్ కైర్టెన్ హోటల్‌లలో ఉన్న వాటాను విక్రయించడంతో అధికంగా నిధులు సమకూరాయి. వీటితోపాటు గ్లోబల్ స్విచ్ డాటా సెంటర్‌లో వాటాను విక్రయించడంతో 2.1 బిలియన్ పౌండ్ల నిధులు లభించాయి. 2018 సంవత్సరానికిగాను విడుదల చేసిన నివేదికలో నాలుగో స్థానంలో ఉన్న ర్యూబెన్ బ్రదర్స్..2019 ఏడాదికిగాను రెండో స్థానం దక్కించుకున్నారు. ఈ ఏడాదికాలంలో వీరి సంపద విలువ 3.56 బిలియన్ పౌండ్లు పెరిగింది.

ఆరు స్థానాలు దిగజారిన లక్ష్మీ మిట్టల్

గ్లోబల్ స్టీల్ టైకూన్‌గా పిలువబడుతున్న లక్ష్మీ ఎన్ మిట్టల్ బ్రిటన్ కుబేరుల టాప్-10 జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. గతేడాది 5 స్థానం లో ఉన్న మిట్టల్..ఈసారికిగాను ఆరు స్థానాలు దిగజారి 11వ స్థానంతో సరిపెట్టుకున్నారు. గడిచిన ఏడాదికాలంలో ఆయన 3.99 బిలియన్ పౌండ్ల సంపదను కోల్పోయారు. రాజస్థాన్‌లో పుట్టిన స్టీల్ దిగ్గజం 10.66 బిలియన్ పౌండ్ల ఆస్తి కలిగివున్నా రు. ఎస్సార్ స్టీల్‌కు చెందిన ప్లాంట్‌ను కొనుగోలు చేసి భారత స్టీల్ రంగంలోకి అడుగుపెట్టారు. మైనిం గ్ దిగ్గజం వేదాంత చీఫ్ అనిల్ అగర్వాల్ 8.72 బిలియన్ పౌండ్లతో 12వ స్థానంలో నిలిచారు. కాగా, గతేడాది తొలిస్థానంలో నిలిచిన కెమికల్స్ సంస్థ వ్యవస్థాపకుడు సర్ జిమ్ రాట్‌క్లిఫ్ ఈసారికిగాను మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఆయన సంపాదన విలువ 18.15 బిలియన్ పౌండ్లు. బ్రిటన్‌లో ఉన్న భూమి, ఆస్తులు, ఇతర ఆస్తుల ఆధారంగా సండే టైమ్స్ రిచ్..వెయ్యి మందితో జాబితాను రూపొందించింది. వీరిలో 45 మంది భారత సంతతికి చెందిన వారు ఉండటం విశేషం.

1197
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles