హైదరాబాద్‌లో అతిపెద్ద వన్‌ప్లస్‌ ఎక్స్‌పీరియెన్స్‌ సెంటర్‌

Wed,May 15, 2019 02:09 AM

Biggest OneX Experience Center In Hyderabad

-ఏర్పాటు చేయనున్న చైనా సంస్థ.. మార్కెట్లోకి సరికొత్త ఫోన్లు
బెంగళూరు, మే 14: హైదరాబాద్‌లో ప్రపంచంలోనే తమ అతిపెద్ద ఎక్స్‌పీరియెన్స్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వన్‌ప్లస్‌ ప్రకటించింది. ప్రపంచ శ్రేణి మార్కెట్‌లో ఖరీదైన మొబైల్‌ ఫోన్ల విభాగంలో యాపిల్‌, సామ్‌సంగ్‌లకు ఈ చైనా కంపెనీ గట్టి పోటీనిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం ఇక్కడ 7, 7 ప్రో స్మార్ట్‌ఫోన్లను వన్‌ప్లస్‌ ఆవిష్కరించింది. ఈ సందర్భంగా వన్‌ప్లస్‌ సహవ్యవస్థాపకుడు కార్ల్‌ పీ మాట్లాడుతూ ‘ఈ ఏడాది కొత్తగా మూడు ఎక్స్‌పీరియెన్స్‌ సెంటర్లను తీసుకొస్తున్నాం. వీటిలో పుణెలో ఒకటి, హైదరాబాద్‌లో మరొకటి ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో హైదరాబాద్‌ సెంటర్‌ ప్రపంచంలోనే అతిపెద్ద వన్‌ప్లస్‌ స్టోర్‌. 16 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మిస్తున్నాం’ అని తెలిపారు.

ఇప్పటికే ఈ సంస్థకు బెంగళూరు, ఢిల్లీ, చెన్నైల్లో ఎక్స్‌పీరియెన్స్‌ సెంటర్లున్న విషయం తెలిసిందే. వన్‌ప్లస్‌కు భారతీయ మార్కెట్‌ ప్రధానంగా ఉండగా, గతేడాది ఇక్కడ సంస్థ ఆదాయం గణనీయంగా పెరిగిన సంగతి విదితమే. కాగా, వన్‌ప్లస్‌ 7 ధర రూ.32,999 (6జీబీ ర్యామ్‌)గా ఉంటే, వన్‌ప్లస్‌ 7 ప్రో ధర రూ.37,999 (6జీబీ ర్యామ్‌)గా ఉన్నది. 6జీబీతోపాటు 8జీబీ, 12జీబీ వేరియంట్లలోనూ 7 ప్రో లభించనుండగా, 8జీబీ ధర రూ.48,999గా, 12జీబీ ధర రూ.57,999గా నిర్ణయించారు. 7 ప్రోలో 6.67 అంగుళాల డిస్‌ప్లే, 48 మెగాపిక్సల్‌, 16 మెగాపిక్సల్‌, 8 మెగాపిక్సల్‌ ట్రిపుల్‌ లెన్స్‌ రేర్‌ కెమెరాలున్నాయి. 4000 మెగాహెట్జ్‌ బ్యాటరీ సామర్థ్యంతో ఇది పరిచయమైంది.

882
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles