బిగ్‌సిలో నోకియా 4.2

Sun,May 12, 2019 12:03 AM

Big C Global General Manager Sridhar Launched Nokia 4 2 Smartphone In Madhapur Branch

హైదరాబాద్, మే 11: ప్రముఖ మొబైల్ రిటైల్ సంస్థ బిగ్‌సిలో నోకియా 4.2 మొబైల్ అందుబాటులోకి వచ్చింది. శనివారం హైటెక్‌సిటిలోని తమ షోరూంలో బిగ్‌సి వ్యవస్థాపక చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బాలు చౌదరి.. హెచ్‌ఎండీ గ్లోబల్ దక్షిణాది విభాగం జనరల్ మేనేజర్ టీఎస్ శ్రీధర్‌తో కలిసి ఈ మొబైల్‌ను ఆవిష్కరించారు. కాగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో నోకియా 4.2 మొబైల్ కేవలం బిగ్‌సి ద్వారానే మార్కెట్‌లో లభించనున్నది. ప్రధాన మొబైల్ ఫోన్ తయారీదారులు తమ ఉత్పత్తులను మార్కెట్‌లోకి బిగ్‌సి ద్వారా ప్రవేశపెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారని, ఈ క్రమంలోనే హెచ్‌ఎండీ గ్లోబల్ సైతం నోకియా 4.2ను బిగ్‌సి ద్వారానే పరిచయం చేయడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలు చౌదరి అన్నారు.

హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చేసే కొనుగోలుపై 10 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తున్నామని, రూ.3,500 విలువగల స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. ప్రీ బుకింగ్‌పై జెబ్రోనిక్స్ బ్లూటూత్ స్పీకర్ కూడా ఉచితమని తెలిపారు. ఈ నెల 13 నుంచి బిగ్‌సి షోరూంలలో లభించే నోకియా 4.2 స్మార్ట్‌ఫోన్ ధర రూ.10,990గా ఉన్నది. 5.71 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో 3జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజీల సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఈ మొబైల్‌లో 13 మెగాపిక్సల్, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా ఉన్నది. 3000 మెగాహెట్జ్ బ్యాటరీతో దీన్ని రూపొందించారు.

1767
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles