భెల్‌ లాభం రూ.121 కోట్లు

Thu,November 14, 2019 12:24 AM

న్యూఢిల్లీ, నవంబర్‌ 13: విద్యుత్‌ పరికరాల తయారీలో అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థయైన భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌(భెల్‌) ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్‌ 30తో ముగిసిన మూడు నెలలకాలానికిగాను సంస్థ రూ.120.85 కోట్ల సమీకృత నికర లాభాన్ని గడించింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.85.24 కోట్ల లాభంతో పోలిస్తే 42 శాతం అధికం. 2018-19 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.6,934.06 కోట్లుగా ఉన్న ఆదాయం గత త్రైమాసికానికిగాను రూ. 6,359.68 కోట్లకు పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలకుగాను రూ.11,033.06 కోట్ల ఆదాయంపై రూ.97.98 కోట్ల నష్టాన్ని చవిచూసింది.

184
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles