ఆకట్టుకున్న భారతీ ఇన్‌ఫ్రాటెల్

Tue,October 22, 2019 12:06 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: దేశంలో టవర్ల నిర్వహణలో అతిపెద్ద సంస్థయైన భారతీ ఇన్‌ఫ్రాటెల్ ఆశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్ 30తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.964 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.600 కోట్లతో పోలిస్తే 61 శాతం అధిక వృద్ధిని నమోదు చేసుకున్నది. గత త్రైమాసికంలో కొత్తగా టవర్లను, ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని భారీగా విస్తరించడం లాభాల్లో భారీ వృద్ధికి దోహదపడిందని భారతీ ఇన్‌ఫ్రాటెల్ చైర్మన్ అఖిల్ గుప్తా తెలిపారు.

289
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles