ఎస్‌బీఐలో మహిళా బ్యాంక్ విలీనం

Tue,March 21, 2017 12:19 AM

 sbi
న్యూఢిల్లీ, మార్చి 20: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)లో భారతీయ మహిళా బ్యాంక్(బీఎంబీ) విలీన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మరింత మందికి చేరువవ్వాలనే ఉద్దేశ్యంతో మహిళా బ్యాంకును ఎస్‌బీఐలో విలీనం చేయనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటికే మహిళలకు రుణాలు అందించడానికి ఎస్‌బీఐ 126 ప్రత్యేక శాఖలను ఏర్పాటుచేసింది. మూడేండ్లక్రితం ప్రారంభమైన బీఎంబీ ఇప్పటి వరకు రూ.192 కోట్ల మేర రుణాలను మహిళలకు ఇచ్చింది. అదే ఎస్‌బీఐ రూ.46 వేల కోట్లు రుణ వితరణ గావించింది. ఎస్‌బీఐలో 2 లక్షల మంది ఉద్యోగులు ఉండగా, వీరిలో 22 శాతం మంది మహిళలు కావడం విశేషం. 2013లో ప్రారంభమైన బీఎంబీ..103 శాఖలను నిర్వహిస్తున్నది. బ్యాంక్ మొత్తం వ్యాపారం రూ.1,600 కోట్ల స్థాయిలో ఉంది.

407

More News

మరిన్ని వార్తలు...