బెనెల్లీ నుంచి రెండు బైకులు

Tue,February 19, 2019 12:39 AM

ప్రారంభ ధర రూ.5 లక్షలు.. హైదరాబాద్‌లోనే తయారుకానున్న వాహనాలు


ముంబై, ఫిబ్రవరి 18: ఇటలీకి చెందిన సూపర్ బైకుల తయారీ సంస్థ బెనెల్లీ..దేశీయ మార్కెట్లోకి మరో రెండు నూతన బైకులను విడుదల చేసింది. సాహసక పర్యాటకుల కోసం రూపొందించిన ఈ రెండు బైకులు 500 సీసీ సామర్థ్యం కలిగివున్నాయి. వీటిలో టీఆర్‌కే 502 ధరను రూ.5 లక్షలుగా నిర్ణయించిన సంస్థ..టీఆర్‌కే 502ఎక్స్ మోడల్ రూ.5.40 లక్షలకు లభించనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ బైకులను ఉత్పత్తి చేయడానికి గతేడాది హైదరాబాద్‌కు చెందిన మహావీర్ గ్రూపుతో బెనెల్లీలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఇందుకోసం మహావీర్ గ్రూపు.. హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో ఏడాదికి 7 వేల బైకుల తయారయ్యే సామర్థ్యం కలిగిన యూనిట్‌ను నెలకొల్పుతున్నది. ఈ బైకులకు డిమాండ్ అధికంగా ఉంటే సామర్థ్యాన్ని పెంచాలనుకుంటున్నట్లు బెనెల్లీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ జబాఖ్ ప్రకటించారు. నూతన బైకులను మార్కెట్లోకి విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ..500 సీసీ సామర్థ్యం కలిగిన బైకుల విభాగంలో ఇప్పటికే దూసుకు పోతున్నామని, 1,500-2,000 యూనిట్ల వరకు ఈ మోడళ్లను విక్రయించాలనుకుంటున్నట్లు చె ప్పారు.

గతేడాది దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టడంలో భాగంగా టీఆర్‌కే మోడళ్లను విడుదల చేసినట్లు, ప్రస్తుత సంవత్సరంలో మరి న్ని వాహనాలను విడుదల చేసే అవకాశం ఉందన్నారు. ఈ నూతన బైకులు కావాలనుకునేవారు సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో బు కింగ్ చేసుకోవచ్చునని ఆయన సూచించారు. బెనెల్లీ గతంలో తన బైకులను తయారు చేయడానికి పుణెకు చెందిన డీఎస్‌కే మోటోవీల్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నది, కానీ డీఎస్‌కే గ్రూపు మోసానికి పాల్పడినట్లు ఆరోపించడంతో ఈ ఒప్పందాన్ని రద్దుచేసుకున్నది. ఆ తర్వాత మహావీర్ గ్రూపుతో జతకట్టింది.

844
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles