పైసలు సరిపడా ఉన్నాయ్

Sun,August 25, 2019 12:59 AM

Banks sitting on comfortable liquidity position

-బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు నిల్వలపై ఎస్బీఐ చైర్మన్ రజ్నీశ్ కుమార్

గౌహతి, ఆగస్టు 24: దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు నిల్వలు సరిపడా ఉన్నాయని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ చైర్మన్ రజ్నీశ్ కుమార్ స్పష్టం చేశారు. శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ కూడా ఓ భాగమని, కాబట్టి ప్రస్తుత అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల నుంచి మన దేశం తప్పించుకునే అవకాశం లేదని అన్నారు. ఇక ఆర్థిక వ్యవస్థలో రుణ వితరణ పెరుగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎస్బీఐ వంటి బ్యాంకుల్లో నగదు లభ్యత సరిపడా ఉన్నది. అయితే రుణాల పంపిణీ పెరుగాల్సి ఉన్నది అని వ్యాఖ్యానించారు. కాగా, ఇటీవలి వృద్ధి గణాంకాల క్షీణత మాంద్యానికి సంకేతం కాదన్నారు. అస్సోం ప్రభుత్వ అధికారులతో సమావేశం సందర్భంగా అక్కడి సర్కారు తీసుకున్న చర్యల గురించిన విలువైన సమాచారాన్ని అందుకున్నామని చెప్పారు.

జీడీపీని గాడిలో పెడుతాం: దాస్

గాడి తప్పిన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెడుతామన్న విశ్వాసాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ వ్యక్తం చేశారు. వచ్చే ఐదేండ్లలో దేశ జీడీపీ 5 లక్షల కోట్ల డాలర్లకు వెళ్లగలదన్న ఆశాభావాన్ని వెలిబుచ్చారు. ప్రస్తుత మందగమన పరిస్థితులు తాత్కాలికమేనన్న ఆయన ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) చివరికల్లా వృద్ధిరేటు 7 శాతాన్ని తాకగలదన్న ధీమాను వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను పురోగమింపజేసేందుకు తన వంతు సాయంగా రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లను ఆర్బీఐ వరుసగా గత నాలుగు సమీక్షల్లో 110 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గించిన విషయం తెలిసిందే.

449
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles