నేడు బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Tue,October 22, 2019 12:09 AM

-నిలిచిపోనున్న ఆర్థిక లావాదేవీలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: బ్యాంకుల విలీనాలను నిరసిస్తూ ఈ నెల 22న(మంగళవారం) పలు బ్యాంకింగ్ ఉద్యోగ సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మె చేయనున్నట్లు ప్రకటించారు. ఉద్యోగ సంఘాలు తీసుకున్న ఈ నిర్ణయంతో బ్యాంకింగ్ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోనున్నాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్(ఏఐబీఈఏ) , బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఈఎఫ్‌ఐ) చేపట్టిన ఈ సమ్మెకు దూరంగా ఉంటున్నట్లు ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఈ సమ్మెపై ఇప్పటికే బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన ఖాతాదారులకు సమాచారాన్ని చేరవేసింది కూడా. మంగళవారం జరుగనున్న దేశవ్యాప్త సమ్మెలో మా బ్యాంక్ ఉద్యోగులు పాల్గొంటున్నారని, దీంతో బ్యాంకింగ్ కార్యాకలాపాలు ప్రభావం చూపనున్నాయని గతవారంలో ఎస్బీఐ, సిండికేట్ బ్యాంకులు స్టాక్ ఎక్సేంజ్‌లకు సమాచారం అందించాయి. ప్రధాన కార్మిక కమిషనర్ నుంచి ఎలాంటి సానుకూల ఫలితం వస్తే అప్పుడు సమ్మె విరమణపై ఆలోచిస్తామని, లేకపోతే సమ్మె యథావిధిగా కొనసాగుతున్నదని ఏఐబీఈఏ జనరల్ కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం తెలిపారు.

5472
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles