బంధన్ బ్యాంక్ లాభంలో 10 శాతం వృద్ధి

Thu,January 10, 2019 11:30 PM

Bandhan Bank Q3 net profit rises 10 percent to Rs 331 crore

ముంబై, జనవరి 10: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో బంధన్ బ్యాంక్ 10 శాతం వృద్ధితో రూ. 331 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు ఇచ్చిన రుణాలకు కేటాయింపులు జరిపినందున లాభాలు తగ్గుముఖం పట్టాయని బంధన్ బ్యాంక్ సీఈవో సీఎస్ ఘోష్ తెలిపారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు ఇచ్చిన రుణాలను ఎన్‌పీఏలుగా పరిగణించడంతో స్థూల నిరర్థక ఆస్తులు 2.4 శాతానికి పెరిగాయి.అయితే మరే ఇతర ఇన్‌ఫ్రా కంపెనీకి రూ. 25 కోట్లకు మించి రుణాలను ఇవ్వలేదని స్పష్టం చేశారు. కాగా, నికర వడ్డీ ఆదాయం 53.5 శాతం పెరిగి రూ. 1,134 కోట్లకు పెరగ్గా, వడ్డీయేతర ఆదాయం 48.1 శాతం వృద్ధితో రూ. 234 కోట్లకు చేరుకున్నట్టు తెలిపారు. నికర వడ్డీ మార్జిన్లు 10.3 శాతానికి పెరిగాయి.

543
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles