బంధన్ బ్యాంక్ వడ్డీ ఆదాయం దన్నుగా పెరిగిన లాభం

Thu,October 11, 2018 02:13 AM

Bandhan Bank Q2 profit surges 47 percent YoY to Rs 488 crore

ముంబై, అక్టోబర్ 10: బంధన్ బ్యాంక్ 47.4 శాతం వృద్ధితో రూ. 488 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. నికర వడ్డీ ఆదాయంలో 55.6 శాతం పెరుగుదల కారణంగా లాభాల్లో వృద్ధిని సాధించింది. కాగా, రుణాలు 51 శాతం పెరిగాయని బంధన్‌బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఘోష్ తెలిపారు. నికర వడ్డీ ఆదాయం రూ. 693 కోట్ల నుంచి రూ. 1,078 కోట్లకు పెరగ్గా, నికర వడ్డీ మార్జిన్ 10.9 శాతానికి పెరిగినట్టు తెలిపారు. మొత్తం రుణాల్లో 51 శాతం పెరుగుదలతో రూ. 33,373 కోట్లకు చేరుగోగా, డిపాజిట్లు 29.6 శాతం పెరిగి రూ. 32,959 కోట్లకు చేరుకున్నట్టు ఆయన తెలిపారు. మొత్తం రుణాల్లో మైక్రో క్రెడిట్ రుణాలు 87 శాతం మేర ఉన్నాయని ఆయన వెల్లడించారు.

671
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS