పెరిగిన ప్రేమ్‌జీ వేతనం

Wed,June 12, 2019 12:59 AM

Azim Premji saw his pay package rise almost 95 per cent

-గతేడాది 95 శాతం వృద్ధి
న్యూఢిల్లీ, జూన్ 11: వచ్చే నెల చివర్లో చైర్మన్‌గా పదవీ విరమణ చేయబోతున్న విప్రోఎగ్జిక్యూటివ్ చైర్మన్ అజీం ప్రేమ్‌జీ గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను 2,62,054 డాలర్ల వేతనాన్ని అందుకున్నారు. మన కరెన్సీలో ఇది రూ.1.81 కోట్లు. అంతక్రితం ఏడాది అందుకున్న జీతంతో పోలిస్తే 95 శాతం పెరిగినట్లు సంస్థ వార్షిక నివేదికలో వెల్లడించింది. ఆయన కుమారుడు రిషద్ ప్రేమ్‌జీ 987,652 డాలర్ల జీతాన్ని అందుకున్నారు. మన కరెన్సీలో ఇది రూ.6.8 కోట్లని సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అంందించింది. అలాగే విప్రో చీఫ్ ఎగ్జిక్యూటివ్ అబిదాలీ జెడ్ నీముచ్‌వాలా వేతనం కూడా 41 శాతం పెరిగి 3.9 మిలియన్ డాలర్ల(రూ.27.3 కోట్లు)కు చేరుకున్నది. వేతన రూపంలో 62,322 డాలర్లు అందుకున్న అజీం ప్రేమ్‌జీ.. కమిషన్ కింద 1,31,231 డాలర్లు, ఇతర మార్గాల ద్వారా 55,705 డాలర్లు, దీర్ఘకాలిక పరిహారం కింద 12,796 డాలర్లు లభించాయి. వేతన, అలెవెన్స్‌ల కింద మిలియన్ డాలర్లు అందుకున్న నీముచ్‌వాలాకు కమిషన్ రూపంలో 8,91,760 డాలర్లు, ఇతర మార్గాల ద్వారా 2 మిలియన్ డాలర్లు లభించాయి.

888
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles