వడ్డీరేట్లను పెంచిన యాక్సిస్ బ్యాంక్


Tue,February 20, 2018 12:36 AM

ముంబై, ఫిబ్రవరి 19: ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థ యాక్సిస్ బ్యాంక్ వడ్డీరేట్లను స్వల్పంగా పెంచినట్లు సోమవారం ప్రకటించింది. మూడు నెలలు, ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్(ఎంసీఎల్‌ఆర్)ను పది బేసిస్ పాయింట్ల చొప్పున సవరించినట్లు తెలిపింది. పెంచిన వడ్డీరేట్లు ఈ నెల 17 నుంచి అమలులోకి వచ్చాయని బ్యాంక్ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్‌ఆర్ 8.40 శాతానికి చేరుకున్నది. జనవరి మొదట్లో బ్యాంక్ వడ్డీరేట్లను స్వల్పంగా పెంచిన విషయం తెలిసిందే.

248
Tags

More News

VIRAL NEWS