అరబిందో లాభం రూ.639 కోట్లు

Wed,November 13, 2019 12:31 AM

హైదరాబాద్, నవంబర్ 12: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.639.50 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించినట్లు అరబిందో ఫార్మా లిమిటెడ్ ప్రకటించింది. 2018-19 ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.611.40 కోట్లతో పోలిస్తే 4.6 శాతం అధికం. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 18 శాతం పెరిగి రూ.5,600.50 కోట్లకు చేరుకున్నది. గతేడాది ఇది రూ.4,751.40 కోట్లుగా ఉన్నది. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ ఎన్ గోవిందరాజన్ మాట్లాడుతూ..మరో త్రైమాసికంలో ఆశాజనక పనితీరును కనబరిచాం, అమెరికా, యూరప్‌లలో అంచనాలకుమించి వృద్ధిని నమోదు చేసుకోవడం ఇందుకు కలిసొచ్చిందన్నారు. మార్కెట్లోకి నూతన ఔషధాలను విడుదల చేయడానికి ఆర్ అండ్ డీ(పరిశోధన అండ్ డెవలప్‌మెంట్)ను మరింత బలోపేతం చేస్తున్నట్లు, ఇందుకోసం భారీ స్థాయిలో నిధులను వెచ్చించనున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే తొలి బయోసిమిలర్ ఔషధం కోసం క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించినట్లు, ఈ ఔషధాన్ని ప్రస్తుత త్రైమాసికంలో మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఆయన సంకేతాలిచ్చారు. గత త్రైమాసికంలో ఫార్ములేషన్ ఆదాయం 21.8 శాతం పెరిగి రూ.4,793.80 కోట్లకు చేరుకున్నది. సంస్థకు వచ్చిన మొత్తం ఆదాయంలో ఈ వాటా 85.6 శాతం. అలాగే ఈయూ ఫార్ములేషన్ ఆదాయం కూడా 21.2 శాతం ఎగబాకి రూ.1,401.3 కోట్లుగా నమోదైంది.

227
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles