అరబిందో 125 % మధ్యంతర డివిడెండ్

Fri,February 8, 2019 12:45 AM

Aurobindo Pharma declares 125Percent interim dividend

హైదరాబాద్, ఫిబ్రవరి 7: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.712.2 కోట్ల నికరలాభాన్ని ఆర్జించినట్లు రాష్ర్టానికి చెందిన అరబిందో ఫార్మా ప్రకటించింది. 2017-18 ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి నమోదైన రూ.595 కోట్ల లాభంతో పోలిస్తే 19.69 శాతం ఎగబాకింది. అమ్మకాలు భారీగా పుంజుకోవడం వల్లనే లాభాల్లో రెండంకెల వృద్ధి నమోదైందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలంలో ఆదాయం రూ.4,336.11 కోట్ల నుంచి రూ.5,269.67 కోట్లకు చేరుకున్నట్లు కంపెనీ ఎండీ ఎన్ గోవిందరాజన్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.1.25 లేదా 125 శాతం మధ్యంతర డివిడెండ్‌ను బోర్డు ప్రకటించింది. అన్ని విభాగాలు, మార్కెట్లలో బలమైన వృద్ధిని నమోదు చేసుకోవడం వల్లనే ఆదాయంలో 22 శాతం పెరుగుదల నమోదైందన్నారు. మరోవైపు సినర్జీ రెమెడిస్‌లో వాటాను మరింత పెంచుకోవడానికి రూ.15 కోట్ల మేర పెట్టుబడి పెడుతున్నది.

727
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles