ఈ ఏడాది మరో పదిట్రక్కులు


Sat,May 20, 2017 12:03 AM

ashok
-అశోక్ లేలాండ్ ప్రెసిడెంట్ అనూజ్ కథురియా
హైదరాబాద్, మే 19: కమర్షియల్ వాహన తయారీలో అగ్రగామి సంస్థ అశోక్ లేలాండ్..దేశీయ మార్కెట్లోకి మరిన్ని వాహనాలను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి పది రకాల నూతన వాహనాలను విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రెసిడెంట్ అనూజ్ కథురియా తెలిపారు. హైదరాబాద్‌లోని హైటెక్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లో కంపెనీ 18 రకాల కమర్షియల్ వాహనాలను ప్రదర్శించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ.. వస్తు, సేవా పన్ను(జీఎస్టీ) అమలులోకి వచ్చిన తర్వాత కమర్షియల్ వాహనాలకు డిమాండ్ నెలకొనే అవకాశం ఉందన్నారు. కమర్షియల్ వాహన విభాగంలో తెలుగు రాష్ర్టాల్లో 45 శాతం వాటా కలిగిన సంస్థ, దేశవ్యాప్తంగా 33 శాతంగా ఉందన్నారు. రాష్ట్రంలో రూ.500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయతలపెట్టిన బస్సు బాడీ యూనిట్ ఇంకా చర్చల దశలో ఉందని, అంతకుమించి సమాచారం ఇవ్వడానికి ఆయన నిరాకరించారు.

207

More News

VIRAL NEWS