ఎన్‌ఎస్‌ఈ చైర్మన్ అశోక్ చావ్లా రాజీనామా

Fri,January 11, 2019 11:58 PM

Ashok Chawla resigns as chairman of NSE

న్యూఢిల్లీ, జనవరి 11: దేశంలో అతిపెద్ద స్టాక్ ఎక్సేంజ్ అయిన నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ చైర్మన్ అశోక్ చావ్లా తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామా వెంటనే అమలులోకి వచ్చింది. ఎయిర్‌సెల్-మాక్సిస్ కేసులో ఆయనను ప్రాసిక్యూట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించిన కొన్ని గంటల్లోనే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఆయనకు వ్యతిరేకంగా కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ప్రాసిక్యూట్ చేయడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి మరింత సమాచారం ఇవ్వడానికి ఎక్సేంజ్ నిరాకరించింది. మాజీ ఆర్థిక కార్యదర్శి అయిన చావ్లా..మార్చి 28, 2016 నుంచి ఎన్‌ఎస్‌ఈ చైర్మన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పౌర విమానకార్యదర్శిగాను, సీసీఐ చైర్‌పర్సన్‌గాను పనిచేశారు. గత నవంబర్‌లో యెస్ బ్యాంక్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు.

517
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles