లైసెన్స్ రాజ్ మళ్లీ వస్తున్నట్లుంది!


Tue,February 13, 2018 12:59 AM

-కేంద్ర బడ్జెట్‌పై అరవింద్ పనగరియా తీవ్ర విమర్శలు
-దేశంలో ఆశావాదం అంతరించిపోయేలా ఉందంటూ ఆందోళన

Panagariya
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా.. ఇటీవలి కేంద్ర బడ్జెట్‌పై ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్ తీరును తీవ్రంగా విమర్శించారు. ఈ బడ్జెట్ 1991కి ముందు దేశంలో ఉన్న లైసెన్స్ రాజ్ రక్షణాత్మక విధానాలకు అద్దం పడుతున్నదని అభిప్రాయపడ్డారు. ఆశావాదం అంతరించిపోయి.. నిరాశావాదం పెచ్చుమీరేలా ఉందంటూ ఆందోళన వెలిబుచ్చారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2018-19)గాను ఈ నెల 1న పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనిపై ఎకనామిక్ టైమ్స్‌కు రాసిన ఓ వ్యాసంలో పనగరియా తనదైన శైలిలో స్పందించారు. గతేడాది డిసెంబర్‌లో చాలావరకు ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం కస్టమ్ సుంకాలను పెంచింది. అయినప్పటికీ ఈ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థలోని ఆశావాలైసెన్స్ రాజ్ మళ్లీ వస్తున్నట్లుంది!

దానికి ఇబ్బంది కలిగించలేదు. కానీ, బడ్జెట్‌లో పతంగులు, పాదరక్షల నుంచి సెల్యులార్ మొబైల్ ఫోన్లు, మోటార్ వాహనాల వరకు దాదాపు అన్ని రకాల ఉత్పత్తులపై సుంకాలను పెంచుతూ ప్రతిపాదనలు చేశారు. ఇప్పుడు మాత్రం ఈ నిర్ణయం ఆశావాదాన్ని దెబ్బతీస్తున్నది అన్నారు. నిజానికి, రెవెన్యూ కార్యదర్శి హుస్ముఖ్ అధియా.. ఈ సుంకాల విధింపు రెవెన్యూ కోసం కాదని స్పష్టం చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్‌ఎంఈ)లకు రక్షణ కల్పించడానికేనని వివరణ ఇచ్చారు. కానీ అలా కనిపించడం లేదు అన్నారు. మరోవైపు పనగరియాపై ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ విభాగమైన స్వదేశీ జాగరణ్ మంచ్‌కు చెందిన అశ్విని మహాజన్, బీజేపీ ఎంపీ సుబ్రమణ్యన్ స్వామి విరుచుకుపడ్డారు.

పనగరియా వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని, 1991కి ముందు పరిస్థితులతో నేటి పరిస్థితులను అంచనా వేయడం సరికాదని మహాజన్ అన్నారు. ప్రపంచ దేశాలు రక్షణాత్మక ధోరణులను అవలంభించినప్పుడు భారత్ కూడా అదే బాటలో నడవాల్సిందేనన్న ఆయన కుంటుబడిన ఎంఎస్‌ఎంఈలకు బడ్జెట్ బాసటగా నిలిచిందన్నారు. రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)నూ పనగరియా గతంలో వ్యతిరేకించినట్లు చెప్పారు. ఇక స్వామి మాట్లాడుతూ నీతీ ఆయోగ్ వైస్ చైర్మన్ పదవి నుంచి పనగరియాను ప్రభుత్వం తీసేయలేదని, ఆయనంతట ఆయనే తప్పుకున్నారని, అయినప్పటికీ ప్రభుత్వంపై ఎందుకీ ఆశ్చర్యకర విమర్శలో అర్థం కావడం లేదన్నారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా పనగరియా తగిన వ్యక్తి కాదన్న ఆయన పనగరియా ఓ విదేశీ వ్యక్తి అని భారతీయ పరిస్థితులపై ఎంతమాత్రం అవగాహన లేదన్నారు.

522

More News

VIRAL NEWS