భారత్‌కు చేరుకున్న జైట్లీ

Sun,February 10, 2019 12:47 AM

Arun Jaitley Returns From US After Treatment:

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: వైద్య చికిత్స నిమిత్తం గత నెల చివర్లో అమెరికాకు వెళ్లిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తిరిగి భారత్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇంటికి తిరిగి రావడం చాలా ఆనందంగా ఉన్నదని ట్విట్టర్ ద్వారా జైట్లీ వెల్లడించారు. కాగా, ఆయన మంత్రిత్వ శాఖను తాత్కాలికంగా రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నెల 1న నరేంద్ర మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన చివరి, ఆరో మధ్యంతర బడ్జెట్‌ను గోయల్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. మీరు ఇంటికి తిరిగి రావడం చాలా సంతోషంగా ఉన్నది అరుణ్‌జైట్లీ జీ. మీ మద్దతు, మార్గదర్శకం, నాయకత్వానికి చాలా కృతజ్ఞతలు అంటు గోయల్ ట్విట్ చేశారు. ఒకవైపు ఆపరేషన్ అయినప్పటికీ మరోవైపు సామాజిక మాధ్యమాల్లో ఆయన పలు స్టోరీలను పోస్ట్‌చేశారు. ముఖ్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు గోయల్‌పై ప్రశంసల జల్లు కురిపించారు కూడా. ప్రస్తుతానికి చికిత్స పూర్తైంది..రివకరీ స్టేజ్‌లో ఉన్నా ను..డాక్టర్లు తిరిగి వెళ్లిపొమ్మని అనుమతించిన తర్వాతనే భారత్‌కు వెళ్తున్నాను..బడ్జెట్‌పై జరిగే చర్చలో గోయల్ సమాధానాలు ఇస్తారు అని న్యూయార్క్ నుంచి బయలుదేరేముందు పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జైట్లీ చెప్పారు.
https://c.ntnews.com/updates/2019/Feb/10/ArunJaitly.jpg

మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి: కవిత


వెల్‌కమ్ బ్యాక్ సర్, మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి అంటూ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని ఉద్దేశించి నిజామాబాద్ ఎంపీ కవిత ట్విట్టర్‌లో ఆకాంక్షించారు. ఇంటికి తిరిగి రావడం సంతోషంగా ఉంది అని జైట్లీ చేసిన ట్వీట్‌పై కవిత ఈ విధంగా స్పందించారు.

1354
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles