హైదరాబాద్‌లో కృత్రిమ మేధస్సు సెంటర్

Tue,October 22, 2019 12:15 AM

-హెక్సాగాన్-నాస్కాం సంయుక్తంగా ఏర్పాటు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దేశీయ, అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌లో తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేయగా.. తాజాగా ఈ జాబితాలోకి స్విడన్‌కు చెందిన రీసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ టెక్నాలజీ సంస్థయైన హెక్సాగాన్ ఏబీ అనుబంధన సంస్థ హెక్సాగాన్ క్యాపబిలిటీ సెంటర్ ఇండియా(హెచ్‌సీసీఐ) పేరుతో ఇక్కడ కృత్రిమ మేధస్సు సెంటర్‌ను నెలకొల్పబోతున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ఐటీ రంగ బాడీ నాస్కాంతో జతకట్టింది. భాగ్యనగరంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఈ కృత్రిమ మేధస్సు సెంటర్‌లో ఉచితంగా ఉన్నత పాఠశాల స్థాయి నుంచే టెక్నాలజీ రంగం గురించి తెలుసుకోవడానికి వీలుంటుందని హెచ్‌సీసీఐ వైస్-ప్రెసిడెంట్, కంట్రీ మేనేజర్ నవనీత్ మిశ్రా తెలిపారు. హెక్సాథాన్ పేరుతో 24 గంటలపాటు నిర్వహించిన హ్యాకతాన్ విజేతలకు హైదరాబాద్‌లో బహుమతులను అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ...నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్(నాస్కాం)తో కలిసి ఇక్కడ కృత్రిమ మేధస్సు కమ్యూనిటీ సెంటర్‌ను నెలకొల్పాలనుకుంటున్నట్లు చెప్పారు. ఇది కేవలం విద్యార్థులకోసం ఏర్పాటు చేయడం లేదు..విశ్లేషకులకోసం, ఇంజినీరింగ్ డిగ్రీ పట్టా పొందిన వారిని దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి సంబంధించి నాస్కాంతో ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన అన్నా రు. ప్రతియేటా ఈ సెంటర్ ద్వారా 350 మంది విద్యార్థులు శిక్షణ తీసుకోనున్నారు.

మరో 100 ఉద్యోగాలు

ప్రస్తుతం హైదరాబాద్ సెంటర్‌లో 1,400 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, ఈ ఏడాది చివరినాటికి మరో వంద మందిని తీసుకోనున్నట్లు మిశ్రా ప్రకటించారు. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 1,500కి చేరుకోనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. 2020వ సంవత్సరాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు) సంవత్సరంగా ప్రకటించినట్లు చెప్పారు. కృత్రిమ మేధస్సుపై ప్రత్యేక దృష్టి సారించేందుకు హెచ్‌సీసీఐ తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్నదని, ఏఐ నుంచి ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడానికి ఈ సెంటర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

592
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles