లోకాయుక్త, హెచ్చార్సీ చైర్మన్‌ను నియమించండి

Sat,November 9, 2019 12:50 AM

-ప్రభుత్వానికి సూచించిన హైకోర్టు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఈ నెల 29కల్లా లోకాయుక్త, ఉపలోకాయుక్త, మాన వ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ) చైర్మన్, సభ్యులను నియమించాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. తెలంగాణ లోకాయుక్త సవరణ చట్టం- 2017 ఈ ఏడాది అక్టోబర్ 30న విడుదల చేసిన నోటిఫికేషన్‌తో అమలులోకి వచ్చిందని, నియామకాలకు సమయం ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోరారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను, అవసరాలను తీర్చే ఈ సంస్థల బాధ్యులను నియమించాల్సిన అవసరం ఉన్నదని ధర్మాసనం పేర్కొన్నది. నియామకాలకు సమయం ఇవ్వాలని ఏజీ కోరుతున్నందున ఈ కేసును 29కి వాయిదావేస్తున్నట్టు పేర్కొన్నది. ఆలోపు నియామకాలు చేపడుతారని భావిస్తున్నామని హైకోర్టు పేర్కొన్నది.

95
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles