అమ్మకానికి అనిల్ ఆస్తులు

Fri,July 12, 2019 03:14 AM

Anil Ambani plans Rs 21,700 crore asset sales to pare massive debt

- రుణ భారాన్ని తగ్గించుకునే దిశగా అంబానీ అడుగులు
- రోడ్డు ప్రాజెక్టుల నుంచి రేడియో స్టేషన్ల వరకు విక్రయం
- రూ.21,700 కోట్ల సమీకరణకు ప్రయత్నాలు


న్యూఢిల్లీ, జూలై 11: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన అనిల్ అంబా నీ.. ఈ ఊబి నుంచి బయటకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే రోడ్డు ప్రాజెక్టుల నుంచి రేడియో స్టేషన్ల వరకున్న ఆస్తులను అమ్మాలని యోచిస్తున్నారు. అనిల్ అంబానీ గ్రూప్‌లో చాలా రకాల సంస్థలు.. వివిధ వ్యాపారాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. బీమా, మౌలిక, టెలికం, కేబుల్ నెట్‌వర్క్, విద్యుత్, ఇంజినీరింగ్, ఫైనాన్స్ తదితర రంగాల్లో అనిల్‌కు వ్యాపారాలున్నాయి. అయితే వీటిలో నాలుగు సంస్థల రుణ భారమే దాదాపు రూ.67,000 కోట్లుగా ఉన్నది.

ఒక్క రిలయన్స్ క్యాపిటల్ అప్పులే రూ.38,900 కోట్లుగా ఉన్నాయి. అలాగే రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు రూ.17,800 కోట్లు, రిలయన్స్ నోవల్ అండ్ ఇంజినీరింగ్‌పై రూ.7,000 కోట్లు, రిలయన్స్ పవర్‌కు రూ.3,000 కోట్ల రుణ భారం ఉన్నది.ఆర్‌కామ్ అప్పులు రూ.35,600 కోట్లుఒకప్పుడు దేశీయ టెలికం రంగాన్నే ఓ ఊపు ఊపిన ఆర్‌కామ్.. ఇప్పుడు దివాలా కోర్టులో దిగాలుగా నించున్నది. ఈ ఏడాది మార్చి 31 నాటికి సంస్థ రుణ భారం సుమారు రూ.35,600 కోట్లుగా ఉన్నది. పెరిగిన పోటీ వాతావరణం, స్పెక్ట్రం ధరలు, 4జీ నెట్‌వర్క్‌తో రిలయన్స్ జియో రాక, తదనంతర పరిణామాలు రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) మూతబడ్డానికి దారితీశాయి. అన్న ముకేశ్ అంబానీ.. తమ జియో కోసం ఆర్‌కామ్ నెట్‌వర్క్ వ్యవస్థను కొనుగోలు చేద్దామని డీల్ కుదుర్చుకున్నా.. అది ఓకే కాకపోవడంతో అనిల్ ఆశలు ఆవిరయ్యాయి. చివరకు దివాలా ప్రక్రియకు వెళ్లాల్సి వచ్చింది.
Anil-Ambani1

ఇన్‌ఫ్రా, క్యాపిటల్ ఆస్తులపైనే గురి

రుణ భారాన్ని తగ్గించుకోవడానికి చూస్తున్న అనిల్ అంబానీ.. రిలయన్స్ ఇన్‌ఫ్రా, రిలయన్స్ క్యాపిటల్ ఆస్తులపైనే దృష్టి పెట్టారు. రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు చెందిన 9 రోడ్డు ప్రాజెక్టులను విక్రయించాలని భావిస్తున్నారు. వీటి విలువ రూ.9,000 కోట్లు. అలాగే ముంబైలోని శాంతాక్రజ్ ఈస్ట్‌లోగల రిలయన్స్ సెంటర్ ఆఫీస్‌ను దీర్ఘకాలిక వ్యవధికిగాను లీజుకు ఇవ్వనున్నారు. దీనివల్ల సమకూరే మొత్తాన్ని ఇంకా అంచనా వేయలేదు. రిలయన్స్ క్యాపిటల్‌లోని రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో 100 శాతం వాటా విక్రయం, రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్, ప్రైం ఫోకస్, ప్రైవేట్ ఈక్విటీ/రియల్ ఎస్టేట్, రేడియో వ్యాపారాలనూ అమ్మేస్తుండగా, వీటి ద్వారా రూ.12,700 కోట్లు రావచ్చని అంచనా. ఇలా మొత్తం రూ.21,700 కోట్లను పొందాలని అనిల్ చూస్తున్నారు. దీంతో కొంతైనా అప్పుల కష్టాలను తీర్చుకోవాలని భావిస్తున్నారు.

3305
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles