నష్టాలను తగ్గించుకున్న ఆంధ్రాబ్యాంక్

Tue,May 14, 2019 12:35 AM

Andhra Bank Q4 loss narrows to Rs 1,224 cr

హైదరాబాద్, మే 13: హైదరాబాద్ కేంద్రస్థానంగా ఆర్థిక సేవలు అందిస్తున్న ప్రభుత్వరంగ సంస్థయైన ఆంధ్రాబ్యాంక్ క్రమంగా నష్టాలను తగ్గించుకుంటున్నది. మార్చి 31తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో బ్యాంక్ రూ.1,233.61 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.2,535.82 కోట్ల నష్టంతో పోలిస్తే రెండు రెట్లు తగ్గాయి. జనవరి-మార్చి మధ్యకాలానికి బ్యాంక్ ఆదాయం రూ.5,092.62 కోట్ల నుంచి రూ.5,313.53 కోట్లకు పెరిగినట్లు బీఎస్‌ఈకి సమాచారం అందించింది. సమీక్షకాలంలో బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 17.09 శాతం నుంచి 16.21 శాతానికి తగ్గగా, నికర ఎన్‌పీఏ 8.48 శాతం నుంచి 5.73 శాతానికి తగ్గింది. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి గడిచిన త్రైమాసికంలో బ్యాంక్ రూ.2,341.06 కోట్ల నిధులను వెచ్చించింది. 2017-18 ఏడాది ఇదే సమయంలో కేటాయించిన రూ.5,562. 76 కోట్లతో పోలిస్తే భారీగా తగ్గాయి.

882
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles