ఆంధ్రా బ్యాంక్‌కు ఎన్‌పీఏ దెబ్బ

Tue,February 12, 2019 01:40 AM

Andhra Bank posts Rs 532 cr loss in Q3

-కూ3లో రూ.579 కోట్ల నష్టం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఆంధ్రా బ్యాంక్ నష్టాలు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో బ్యాంక్ నికర నష్టం రూ.578.59 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2017-18) అక్టోబర్-డిసెంబర్‌లో రూ.532.02 కోట్లుగా ఉన్నది. మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పీఏ) పెరుగడమే నష్టాలు పెరుగడానికి ప్రధాన కారణమని బ్యాంక్ సోమవారం తెలియజేసింది. అయితే ఆదాయం మాత్రం పెరిగినట్లు వెల్లడించింది. ఈసారి రూ.5,322.33 కోట్లుగా ఉంటే, పోయినసారి రూ.5,093.43 కోట్లుగానే ఉన్నదని స్పష్టం చేసింది. ఇక మొండి బకాయిలు గతంతో పోల్చితే రూ.1,744.99 కోట్ల నుంచి రూ.1,790.17 కోట్లకు పెరిగినట్లు బ్యాంక్ ఈ సందర్భంగా తెలియజేసింది. మొత్తం బ్యాంక్ స్థూల మొండి బకాయిలు కూడా రూ.21,599.32 కోట్ల నుంచి రూ.28,703.47 కోట్లకు ఎగబాకినట్లు వెల్లడించింది. అయితే నికర ఎన్‌పీఏ మాత్రం రూ.10,858.32 కోట్ల నుంచి రూ.10,778.36 కోట్లకు తగ్గినట్లు పేర్కొన్నది. ఇదిలావుంటే త్రైమాసిక ఆర్థిక ఫలితాల నేపథ్యంలో సోమవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ ట్రేడింగ్‌లో ఆంధ్రా బ్యాంక్ షేర్ విలువ 0.42 శాతం దిగజారి రూ.23.95 వద్ద నిలిచింది.

1464
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles