ఖరీదైన ఇండ్లకు మళ్లీ గిరాకీ

Sun,August 25, 2019 12:52 AM

ANAROCK Property Consultants conducted a comprehensive survey

-హైదరాబాద్‌సహా ఏడు నగరాలపై అనరాక్ ప్రాపర్టీ సర్వే

న్యూఢిల్లీ, ఆగస్టు 24: పాత పెద్ద నోట్ల రద్దు తర్వాత భారీగా క్షీణించిన లగ్జరీ హౌజింగ్ మళ్లీ పుంజుకున్నది. రూ.1.5 కోట్లకుపైగా విలువ చేసే ఇండ్లకు ఈ ఏడాది ప్రథమార్ధం (జనవరి-జూన్)లో పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తమైందని ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ తెలియజేసింది. హైదరాబాద్, ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, పుణెల్లో జరిపిన సర్వేలో గతంతో పోల్చితే రెండింతలకుపైగా పెరిగి 16,100 యూనిట్లు ప్రారంభమైనట్లు తేలింది. హైదరాబాద్‌లో 2,070 యూనిట్లు మొదలైనట్లు చెప్పింది.

535
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles