కుంగదీసిన గ్లోబల్ మార్కెట్లు

Thu,December 6, 2018 01:11 AM

An evening walk down Dalal Street Global cues RBI meet outcome weigh on indices Nifty below 10,800

-36,000 దిగువన సెన్సెక్స్
అంతర్జాతీయ మార్కెట్ల పతనంతో నష్టాలతోనే ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్.. రిజర్వ్ బ్యాంక్ పరపతి విధానం తర్వాత కూడా కోలుకోలేకపోయింది. సెన్సెక్స్ 249.90 పాయింట్ల నష్టంతో 35,884.41 వద్ద ముగిసింది. నిఫ్టీ 86.60 పాయింట్ల నష్టంతో 10,782.90 వద్ద నిలిచింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మందగించవచ్చునన్న ఆందోళనలో మంగళవారం రాత్రి డోజోన్స్ ఇండెక్స్ 800 పాయింట్లు నష్టపోవడంతో ఆసియా, యూరప్ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో కూడా సెంటిమెంట్ బలహీనపడింది. దాదాపు అన్ని రంగాల ఇండెక్స్‌లూ నష్టాల్లోనే ముగిశాయి. పరపతి విధానాన్ని ప్రకటిస్తున్న సమయంలో మార్కెట్లు ఒక్కసారిగా క్షీణించినా.. చివరలో కోలుకోగలిగాయి. అయితే ప్రారంభంలో వచ్చిన నష్టాలు అలాగే కొనసాగాయి. పరపతి విధానంలో చట్టబద్ధ ద్రవ్యనిష్పత్తి (ఎస్‌ఎల్‌ఆర్)ను తగ్గించినప్పటికీ మార్కెట్లు పుంజుకోలేకపోయాయి. రూపాయి మారకం విలువ కూడా మార్కెట్ కదలికలపై ప్రభావం చూపింది. క్రూడాయిల్ ధరలు స్థిరంగా ట్రేడ్ అవుతున్నాయి.

కాగా, ఐటీ ఇండెక్స్ మాత్రమే 0.09 శాతం లాభంతో ముగిసింది. మిగిలిన అన్ని ఇండెక్స్‌లూ నష్టాలతోనే ముగిశాయి. మెటల్ ఇండెక్స్ 3.61 శాతం, ఫార్మా ఇండెక్స్ 2.78 శాతం, ఆటో ఇండెక్స్ 2.38 శాతం, మీడియా ఇండెక్స్ 1.67 శాతం ఎఫ్‌ఎంసీజీ 0.71 శాతం, బ్యాంక్ నిఫ్టీ 0.65 శాతం చొప్పున నష్టాలకే పరిమితమయ్యాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.46 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.78 శాతం మేరకు నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈలో మొత్తం 1,307 షేర్లు నష్టాలతో ముగిస్తే, 471 షేర్లు మాత్రమే లాభాలతో ముగిశాయి. నిఫ్టీలో కేవలం పది షేర్లే లాభాలను గడించగలిగాయి. హిందుస్తాన్ యూనీలీవర్ షేరు గరిష్టంగా 2. 45 శాతం లాభపడగా, హెచ్‌డీఎఫ్‌సీ 1.60 శాతం, భారతీ ఇన్‌ఫ్రాటెల్ 1.24 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.95 శాతం చొప్పున లాభాలతో ముగిశాయి. సన్‌ఫార్మా 5.80 శాతం నష్టపోగా, హిందాల్కో 5.19 శాతం, టాటాస్టీల్ 4.03 శాతం, ఇండియా బుల్ హౌజింగ్ ఫైనాన్స్ 3.94 శాతం, వేదాంత 3.93 శాతం చొప్పున నష్టపోయాయి. ఎస్‌అండ్‌పీ డౌన్‌గ్రేడ్ చేయడంతో టాటా మోటార్స్ 3.24 శాతం మేర నష్టపోయింది. కాగా, ఎఫ్‌ఐఐలు రూ. 357.82 కోట్లు, డీఐఐలు రూ. 791.59 కోట్ల చొప్పున అమ్మకాలు జరిపారు.

3 పైసలు కోలుకున్న రూపాయి

బుధవారం ఫారెక్స్ ట్రేడింగ్‌లో డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 3 పైసలు కోలుకుని రూ. 70.46 వద్ద ముగిసింది. బ్యాంకులు, ఎగుమతిదారులు డాలర్లను అమ్మడంతో రూపాయి విలువ పతనం ఆగి స్వల్పంగా కోలుకోగలిగిందని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. ఒక దశలో రూ. 70.75కు క్షీణించిన రూపాయి మారకం విలువ.. రిజర్వ్ బ్యాంక్ పరపతి విధాన ప్రకటన తర్వాత కోలుకోగలిగింది.

523
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles