అమర రాజా డివిడెండ్ 508 శాతం

Thu,May 16, 2019 02:16 AM

Amara Raja Q2 PAT grows 8.7at Rs 119 crore

హైదరాబాద్, మే 15: ప్రముఖ బ్యాటరీల తయారీ సంస్థ అమర రాజా బ్యాటరీస్ ఆశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో రూ. 1,566.73 కోట్ల ఆదాయంపై రూ.119.34 కోట్ల పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఆదాయం ఒక్క శాతం తగ్గగా, నికర లాభం మాత్రం పది శాతం పెరిగింది. ఈ త్రైమాసికంలో ప్రతిషేరుకు రూ.6.99 ఆదాయాన్ని ఆర్జించినట్లు అయింది.. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.6,793.11 కోట్ల (12 శాతం వృద్ధి)పై పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభం రూ.483.49 కోట్లు నమోదు చేసుకున్నది. ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించడంతో కంపెనీ వాటాదారులుకు భారీ స్థాయిలో పంచింది. రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ. 5.08 (508 శాతం) తుది డివిడెండ్‌ను బోర్డు ప్రతిపాదించింది. దీనికోసం త్వరలో జరుగనున్న వార్షిక సాధారణ సమావేశంలో వాటాదారుల అనుమతి తీసుకోనున్నది. గతేడాది నవంబర్‌లో రూ.2 లేదా 200 శాతం మధ్యంతర డివిడెండ్ చెల్లింపులు జరిపిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కంపెనీ వైస్ చైర్మన్, ఎండీ జయదేవ్ గల్లా మాట్లాడుతూ..ఆటోమోటివ్ బ్యాటరీ వ్యాపా రం రెండంకెల వృద్ధిని నమోదు చేసుకోవడం ఇందుకు కలిసొచ్చిందన్నారు. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా నూతన ఉత్పత్తులను రూపొందించడానికి పెద్దపీట వేస్తున్నట్లు, ఇందుకోసం భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ఆయన ప్రకటించారు.

525
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles