ఆలీబాబా అదుర్స్

Mon,November 12, 2018 12:06 AM

Alibabas Singles Day sales hit new high 24 3 dollars billion

బీజింగ్, నవంబర్ 11: చైనాకు చెందిన ప్రముఖ ఈ-కామర్స్ సేవల సంస్థ ఆలీబాబా ప్రకటించిన ఒకరోజ విక్రయ ఆఫర్‌కు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రస్తుత సంవత్సరానికిగాను సింగిల్ డే ఆఫర్ ప్రారంభించిన తొలి ఐదు నిమిషాల్లో 300 కోట్ల డాలర్ల విక్రయాలు జరిపింది. తొలి గంటలోనే 10 బిలియన్ డాలర్లకు చేరుకున్న అమ్మకాలు చివరకు 31 బిలియన్ డాలర్లకు చేరాయి. గడిచిన ఏడాది ఇదే రోజు విక్రయించిన 25 బిలియన్ డాలర్లతో పోలిసే 21 శాతం అధికం. ఇందుకోసం సంస్థ 1.80 లక్షల ఉత్పత్తులను సిద్ధంగా ఉంచింది. వీటిలో షియామీ, ఆపిల్‌కు చెందిన అన్ని రకాల ఉత్పత్తులు అధికంగా ఉన్నాయి. చైనాతోపాటు లాస్ ఎంజిల్స్, ఫ్రాంక్‌ఫర్ట్, టోక్యో దేశాల నుంచి అధికంగా ఆర్డర్లు వచ్చాయి. వీటిలో ఆపిల్, షియోమీ, ఇతర మొబైల్ సంస్థల ఉత్పత్తులకు డిమాండ్ నెలకొంది. కంపెనీ విక్రయాలు నిలకడగా ఉండటంతో ప్రస్తుత సంవత్సరంలో కంపెనీ షేరు 16 శాతం వరకు పడిపోయింది. అమెరికా, చైనా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధమేఘాలు కూడా పతనానికి ఆజ్యంపోశాయి.

696
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles