ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి యూపీఐ ఆధారిత చెల్లింపు సేవలు


Mon,September 18, 2017 12:22 AM

airtel
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) ఆధారిత డిజిటల్ చెల్లింపు సేవలను ప్రారంభించినట్లు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ప్రకటించింది. తద్వారా సంస్థ కస్టమర్లు ఏదేని బ్యాంక్ ఖాతాకు లావాదేవీ రుసుము చెల్లించకుండానే నగదు బదిలీ చేసే అవకాశం ఉంటుంది. డిజిటల్ ప్లాట్‌ఫాంను యూపీఐతో అనుసంధానం చేసిన తొలి పేమెంట్స్ బ్యాంక్ ఇదే. ప్రస్తుతం ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌కు 2 కోట్ల మంది కస్టమర్లున్నారు. తమ ఖాతాదారులందరూ ఎయిర్‌టెల్ యాప్‌లో వ్యక్తిగత యూపీఐ హ్యాండిల్‌ను క్రియేట్ చేసుకోవాలని సంస్థ ఈ సందర్భంగా కోరింది. తద్వారా ఈ సంస్థ కస్టమర్లు ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లోనూ డిజిటల్ చెల్లింపులు జరుపవచ్చు. అలాగే సంస్థ కస్టమర్లు తమ బ్యాంక్ ఖాతాను భీమ్ యాప్‌కు అనుసంధానించి యూపీఐ చెల్లింపులు జరిపేందుకు సైతం వీలుంటుందని ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఎండీ, సీఈవో శశి అరోరా తెలిపారు. యూపీఐ టెక్నాలజీతో మొబైల్ వినియోగదారులు వర్చువల్ అడ్రస్ సాయంతో ఒక బ్యాంక్ ఖాతా నుంచి మరో ఖాతాకు సొమ్ము బదిలీ చేయవచ్చు. డబ్బులు పంపదలుచుకున్న బ్యాంక్ ఖాతా నంబర్ లేదా ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ వంటి వివరాలు తెలియాల్సిన అవసరం లేదు.

124

More News

VIRAL NEWS