పెరిగిన ఎయిర్ ఇండియా ఆదాయం

Sat,January 12, 2019 11:54 PM

Air Indias passenger revenue grows by 20 percent in Q3 of 2018 to 19

మూడో త్రైమాసికంలో 20 శాతం వృద్ధి
న్యూఢిల్లీ, జనవరి 12: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయంలో వృద్ధి నమోదైంది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 20 శాతం పెరిగి రూ.5,538 కోట్లకు చేరుకున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. క్రితం ఏడాది ఇదే సమయంలో ఆదాయం రూ.4,615 కోట్లుగా ఉన్నది. ప్రయాణికుల సంఖ్య కూడా 53.28 లక్షల నుంచి 55.27 లక్షలకు పెరిగింది. నష్టాల్లో నడుస్తున్న ఎయిర్ ఇండియాకు ప్రస్తుతం రూ.48 వేల కోట్ల అప్పు ఉన్నది. దీనిని తగ్గించుకునే ఉద్దేశంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సంస్థలో వ్యూహాత్మక వాటా ను విక్రయించనున్నట్లు ప్రకటించినప్పటికీ ఏ ఒక్క సంస్థ కూడా ముందుకు రాలేదు. కాగా, మూడో త్రైమాసికంలో సంస్థ మరో 15 నూతన విమానాలతో సేవలను ఆరంభించింది.

ఈ సందర్భంగా పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు మాట్లాడుతూ.. రుణాలను తగ్గించుకోవడానికి ఈ మాత్రం ఆదాయం సరిపోదని, ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కంపెనీకి వచ్చిన మొత్తం ఆదాయంలో 65 శాతం అంతర్జాతీయ రూట్ల నుంచి రాగా, మిగతా 35 శాతం దేశీయంగా సర్వీసులు అందించడం వల్ల సమకూరింది. రుణాలపై వడ్డీలు రోజురోజుకు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. ఈ స్వల్ప ఆదాయంతో లాభాల్లోకి రావడం కలే అని వ్యాఖ్యానించడం గమనార్హం. 2007 నుంచి ఇప్పటి వరకు సంస్థ నష్టాలనే ప్రకటించింది. ప్రస్తుతం కంపెనీ చేతిలో 122 విమానాలున్నాయి.

606
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles