హైదరాబాద్-భువనేశ్వర్ మధ్య ఎయిర్ ఏషియా సర్వీసు

Thu,December 7, 2017 12:10 AM

Air Asia India adds one A320 to connect Hyderabad-Bhubaneshwar

air-asia
హైదరాబాద్, డిసెంబర్ 6: చౌక విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా..హైదరాబాద్-భువనేశ్వర్ మధ్య విమాన సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. జనవరి 1 నుంచి అందుబాటులోకి రానున్న ఈ విమానం భువనేశ్వర్‌లో ఉదయం 9.15గంటలకు బయలుదేరి హైదరాబాద్‌కు 10.55 గంటలకు చేరుకోనున్నది. తిరుగు ప్రయాణంలో హైదరాబాద్‌లో 11.25 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1 గంటలకు భువనేశ్వర్‌కు చేరుకోనున్నదని కంపెనీ వెల్లడించింది. ప్రారంభ ఆఫర్ కింద విమాన టిక్కెట్టు ధరను రూ.1,999గా నిర్ణయించింది. దీంతోపాటు సంస్థ బెంగళూరు-భువనేశ్వర్, బెంగళూరు-జైపూర్‌ల మధ్య కూడా విమాన సర్వీసులను నడుపనున్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో అమర్ అబ్రోల్ తెలిపారు.

217
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS