5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీ సాధ్యమే: ప్రణబ్

Sun,August 25, 2019 12:47 AM

Aim of becoming 5 trillion economy possible

కోల్‌కతా, ఆగస్టు 24: పక్కా ప్రణాళికతో ముందుకెళ్తే దేశ ఆర్థిక వ్యవస్థను ఐదేండ్లలో 5 లక్షల కోట్ల డాలర్లకు చేర్చడం సాధ్యమేనని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. వివేకవంతమైన ఆర్థిక నిర్వహణ ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి భారత జీడీపీ విలువ 5 లక్షల కోట్ల డాలర్లను తాకగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. శనివారం ఇక్కడ కార్పొరేట్ అడ్వైజర్స్ అండ్ ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్ నిర్వహించిన సదస్సుకు విచ్చేసిన ఆయన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)పై మరింత స్పష్టత అవసరమని అభిప్రాయపడ్డారు. ఇక గతేడాది నుంచే ఆర్థిక మందగమనం సంకేతాలు కనిపిస్తున్నాయన్న ఆయన పెరుగుతున్న కార్పొరేట్ మోసాలపట్ల ఆందోళన వ్యక్తం చేశారు.

385
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles