వ్యక్తిగత చార్జింగ్ స్టేషన్లు!

Mon,November 12, 2018 12:08 AM

ADB inks pact with EESL to provide USD 13 million loan

ప్రోత్సహిస్తామన్న కేంద్ర మంత్రి ఆర్‌కే సింగ్
న్యూఢిల్లీ, నవంబర్ 11: ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంపొదించడానికి త్వరలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పాలసీని ప్రకటించబోతున్నది. ఈ పాలసీలో కమర్షియల్ అవసరాల నిమిత్తం వ్యక్తిగతంగా చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని ప్రజలకు కల్పించనున్నట్లు కేంద్ర విద్యుత్, పునరుత్పాదక శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ వెల్లడించారు. ఈవీ చార్జింగ్ పాలసీకి సంబంధించి సూచనలు చేయాలని ఇతర డిపార్ట్‌మెంట్లు, మంత్రిత్వ శాఖలను కోరినట్లు మంత్రి చెప్పారు. ఇదే క్రమంలో ప్రతి ఒక్కరు ఉచితంగా ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించనున్నట్లు ఇంటర్నేషనల్ సింపోసియ్ టూ ప్రమోట్ ఇన్నోవేషన్ అండ్ రీసర్చ్ ఇన్ ఎనర్జీ ఎఫిసెన్సీ(ఇన్‌స్పైర్) కార్యక్రమంలో మంత్రి చెప్పారు. వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకున్న చార్జింగ్ స్టేషన్లను కమర్షియల్ పరంగా వినియోగించుకోవచ్చునని, ఇందుకు ఎలాంటి లైసెన్స్ అవసరం లేదని మంత్రి స్పష్టంచేశారు. దేశవ్యాప్తంగా విద్యుత్‌తో నడిచే వాహనాలకు ఊతమివ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

ఈఈఎస్‌ఎల్‌కు ఏడీబీ 13 మిలియన్ డాలర్ల రుణం

నూతన పరిశోధనలు, బిజినెస్ పద్దతిని విస్తరించడానికి ఈఈఎస్‌ఎల్(ఎనర్జీ ఎఫిసెన్సీ సర్వీసెస్ లిమిటెడ్), ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ)లు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంతో 13 మిలియన్ డాలర్ల రుణాన్ని ఏడీబీ కేటాయించనున్నది. అంతర్జాతీయంగా పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఈఈఎస్‌ఎల్ వర్గాలు వెల్లడించాయి. దీంతో హోటల్స్, ఆసుపత్రులు, విమానాశ్రయాలు, కమర్షియల్ మాల్స్, కమర్షియల్/ప్రభుత్వ భవంతులు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్, విద్య ఇనిస్టిట్యూట్‌లు, డాటా సెంటర్‌లతో పాటు ఇతర వాటికి ప్రయోజనం కలుగనున్నది.

1037
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles