ఆదానీ పోర్ట్స్ లాభాల్లో నిస్తేజం


Sat,August 12, 2017 11:54 PM

న్యూఢిల్లీ, ఆగస్టు 12: దేశంలో అతిపెద్ద రేవుల నిర్వహణ సంస్థ ఆదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్(ఏపీసెజ్) ఆర్థిక ఫలితాలకు అధిక పన్ను సెగ తగిలింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.710.25 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.822.57 కోట్ల లాభంతో పోలిస్తే 13.65 శాతం క్షీణత నమోదైంది. ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో కంపెనీ ఆదాయం రూ.2,085.14 కోట్ల స్థాయి నుంచి రూ.2,959.63 కోట్లకు ఎగబాకింది. సమీక్షకాలంలో కంపెనీ నిర్వహణ ఖర్చులు రూ.1,206.40 కోట్ల స్థాయి నుంచి రూ.1,867.43 కోట్లకు చేరుకున్నాయి. రేవులు, లాజిస్టిక్ వ్యాపారాలు ఆశించిన స్థాయి కంటే మెరుగైన పనితీరు కనబరిచాయని ఏపీసెజ్ సీఈవో కరణ్ అదానీ తెలిపారు. సామర్థ్యం పెంపు, ఆటోమేషన్, టెక్నాలజీ సేవలు, ఖర్చులు తగ్గించుకోవడానికి అధిక ప్రాధాన్యత నివ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గడిచిన త్రైమాసికంలో ఏపీసెజ్ ద్వారా 5 కోట్ల టన్ను సరుకు రవాణా అయింది. ప్రస్తుతం దేశంలో రెండో అతిపెద్ద వ్యాపారాన్ని కలిగివున్న ఆదానీ గ్రూపు వార్షిక టర్నోవర్ 1200 కోట్ల డాలర్లుగా నమోదైంది.

112

More News

VIRAL NEWS