ఇక ఉద్దెరకు ఇంధనం

Wed,July 10, 2019 03:50 AM

A cash-free fuel scheme at India s petrol pump was launched on Tuesday

పటాన్‌చెరు రూరల్, నమస్తే తెలంగాణ: జేబులో చిల్లిగవ్వ లేదు.. ప్రయాణిస్తున్న వాహనంలో ఇంధనం అయిపోయిందా.. అయినా ఇక చింతక్కర్లేదు. నేరుగా భారత్ పెట్రోల్ బంకు కు వెళ్లండి.. అక్కడ కావాల్సినంత ఇంధనం పోయించుకోండి. శ్రీరామ్ ట్రాన్స్‌పోర్టు, భారత్ పెట్రోలియంతో ఇలాంటి ఒప్పందం ఒకటి కుదుర్చుకున్నది. ఈ మేరకు పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని భారత్ పెట్రోల్ పంపులో నగదు రహిత ఇంధనం అందజేసే పథకాన్ని మంగళవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా శ్రీరామ్ టాన్స్‌పోర్టు ఫైనాన్స్ సంస్థ ఎండీ, సీఈవో ఉమేష్ జీ రేవంకర్ మాట్లాడుతూ.. తమ సంస్థ దేశంలోనే తొలిసారిగా నగదు రహిత ఇంధనం కొనుగోలు పథకాన్ని అందుబాటులోకి తెచ్చిందని, సంస్థలో సభ్యులైన 20 లక్షల మంది వినియోగదారుల్లో వాహనదారులకు, డ్రైవర్లకు ఈ సదుపాయం లాభిస్తుందన్నారు. ఇంధనం డబ్బులు తర్వాత చెల్లించుకునే సౌకర్యం కల్పించామన్న ఆయన వాయిదాల రూపంలోనూ ఇవ్వొచ్చన్నారు.

1715
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles