బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్లో 92,700 మందికి వీఆర్‌ఎస్

Wed,December 4, 2019 12:30 AM

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: ప్రభుత్వరంగ టెలికం సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ ప్రకటించిన స్వచ్ఛంద పదవీ విరమణ పథకం(వీఆర్‌ఎస్)కు సిబ్బంది నుంచి విశేష స్పందన లభించింది. ఈ పథకం కింద 92,700 మంది సిబ్బంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకుగాను ఇరు సంస్థలకు ప్రతి ఏటా 8800 కోట్ల రూపాయలు ఆదా కానున్నది ఈ వీఆర్‌ఎస్ పథకానికి మంగళవారం చివరి రోజు. వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నవారిలో బీఎస్‌ఎన్‌ఎల్‌లో 78,300 మంది సిబ్బంది ఉండగా, ఎంటీఎన్‌ఎల్‌లో 14,378 మంది ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 82 వేల మంది వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకుంటారని భావించినప్పటికీ 78 వేల మంది వచ్చారని, వీరితోపాటు 6 వేల మంది సిబ్బంది పదవీ విరమణ చేశారని బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండీ పీకే పుర్వార్ తెలిపారు. కానీ, మరో సంస్థ ఎంటీఎన్‌ఎల్‌లో లక్ష్యానికి మించి దరఖాస్తు చేసుకున్నారు. 13,650 మంది వీఆర్‌ఎస్‌ను ఎంపిక చేసుకుంటారనుకున్నప్పటికీ 14,378 మంది దరఖాస్తుచేసుకున్నారని ఎంటీఎన్‌ఎల్ సీఎండీ సునీల్ కుమార్ వెల్లడించారు. దీంతో కంపెనీ వార్షిక వేతనాలు రూ.2,272 కోట్ల నుంచి రూ.500 కోట్లకు తగ్గనున్నాయి.

334
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles