సైబర్ దాడుల కలకలం

Thu,March 14, 2019 12:51 AM

76% Indian businesses hit by cyber attacks Survey

-2018లో 76 శాతం దేశీయ వ్యాపారాలపై దాడి
న్యూఢిల్లీ, మార్చి 13: భారత్‌లో సైబర్ దాడులు మళ్లీ ఉదృతమయ్యాయి. గడిచిన సంవత్సరంలో దేశీయ వ్యాపారాలపై 76 శాతం జరిగినట్లు ఓ సర్వే వెల్లడించింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే మెక్సికో, ఫ్రాన్స్ తర్వాత భారత్‌లో ఈ దాడులు అధికమని బ్రిటన్‌కు చెందిన ఎండొపాయింట్ సెక్యూరిటీ ప్రొవైడర్ సోఫోస్ వెల్లడించింది. గడిచిన సంవత్సరంలో 76 శాతం సంస్థలు సైబర్ దాడులతో ఇబ్బందులు ఎదుర్కొన్నాయని తెలిపింది. అంతర్జాతీయ దేశాల్లో ఇది 68 శాతంగా ఉన్నది. ముఖ్యంగా అక్రమంగా నగదును సంపాదించాలనే ఉద్దేశంతో సైబర్ దాడులకు పాల్పడుతున్నారని, వీటిలో ఆర్థిక సేవలు, ఆయిల్ అండ్ గ్యాస్, ఇంధన రంగాలపై ఇవి అధికమని సోఫోస్ ఇండియా అండ్ సార్క్ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ తెలిపారు.

డిసెంబర్ 2018 నుంచి జనవరి 2019 వరకు దేశవ్యాప్తంగా 3,100 ఐటీ సంస్థలపై నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ సైబర్ దాడుల్లో 18 శాతం స్మార్ట్‌ఫోన్ల ఆధారంగా జరిగినట్లు తేలింది. అంతర్జాతీయంగా జరిగిన దాడులతో పోలిస్తే ఇది రెండు రెట్లు అధికం. సర్వర్, నెట్‌వర్క్‌ల వంటి రెండు విభాగాల నుంచి సైబర్ దాడులు అధికంగా జరుగుతున్నాయని గుర్తించడం జరిగిందని, అలాగే ఎండ్‌పాయింట్, మొబైల్ కూడా ఎంతదూరంలో లేవని శర్మ స్పష్టంచేశారు. సర్వర్ల ఆధారంగా 39 శాతం సైబర్ దాడులు జరిగినట్లు, నెట్‌వర్క్ నుంచి 35 శాతం, ఎండ్‌పాయింట్స్ నుంచి 8 శాతం జరిగాయని తెలిపింది. ఒక్కో సైబర్ దాడిని పరిష్కరించడానికి ఆయా సంస్థలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తున్నదని, ఇందుకోసం ఏడాదికి 48 రోజుల సమయం పడుతున్నదని(నెలకు నాలుగు రోజులు) సర్వే తెలిపింది.

657
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles