విప్రోలో 600 మందికి ఉద్వాసన


Fri,April 21, 2017 12:28 AM

Outsourcing
న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: దేశంలో మూడో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థ విప్రో.. 600 మంది సిబ్బందికి ఉద్వాసన పలికినట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లో మరింత మందిని తొలగించవచ్చని, మొత్తం సంఖ్య 2000కు చేరుకోవచ్చని అంచనాలున్నాయి. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న విప్రోలో డిసెంబర్ 2016 చివరినాటికి 1.79 లక్షల మంది ఉద్యోగులున్నారు. ఈమధ్యే వార్షిక పనితీరు మదింపు జరిపిన సంస్థ.. వందలాది మంది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు జారీ చేసినట్లుగా తెలుస్తున్నది. సంస్థ వ్యాపార లక్ష్యాలు, వ్యూహాత్మక ప్రాధాన్యత, క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా మానవ వనరులను సమరేఖలో కూర్చుకునేందుకు సంస్థ ఎప్పటికప్పుడు సిబ్బంది పనితీరుపై మదింపు జరుపుతుంటుందని విప్రో వెల్లడించింది. ఇందులోభాగంగా కొంతమందిని సంస్థ నుంచి వేరు చేయాల్సి రావచ్చని, ఉద్యోగం నుంచి తొలగించే వారి సంఖ్య ఏటేటా మారుతుంటుందని పేర్కొంది. అయితే, ఈ ఏడాది ఎంతమందిని తొలగించిన విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. సంస్థ సమగ్ర పనితీరు మదింపు ప్రక్రియలో పర్యవేక్షణ, పునః శిక్షణ, నైపుణ్య ఆధునీకరణ కూడా భాగమేనని తెలిపింది. ఈనెల 25న విప్రో నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించనుంది.

370

More News

VIRAL NEWS