లాట్‌లో రెడ్మీ నోట్-4

Tue,March 21, 2017 12:23 AM

lot
హైదరాబాద్, మార్చి 20: తెలుగు రాష్ర్టాల్లో అత్యంత వేగంగా విస్తరిస్తున్న మల్టీబ్రాండ్ మొబైల్ రిటైల్ సంస్థ లాట్ మొబైల్స్‌లోనూ షామీకి చెందిన రెడ్మీ నోట్-4 స్మార్ట్‌ఫోన్లు లభ్యమవనున్నాయి. ఇందుకోసం ఇరు సంస్థల మధ్య అంగీకార ఒప్పందం కుదిరింది. ఆన్‌లైన్‌లో కేవలం 45 రోజుల్లో పదిలక్షల యూనిట్లు అమ్ముడై రికార్డు నెలకొల్పిన రెడ్మీ నోట్-4ను ఆఫ్‌లైన్‌లో విక్రయించేందుకు సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు లాట్ వర్గాలు తెలిపాయి. 5.5 అంగుళాల టచ్‌స్క్రీన్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్లో ఫింగర్‌ప్రింట్ స్కానర్, 13 మెగాపిక్సెల్ కెమెరా, 4,100 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

478

More News

మరిన్ని వార్తలు...