20న జీఎస్టీ కౌన్సిల్ భేటీ

Sat,September 14, 2019 03:10 AM

20th GST Council Meeting

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: ఆర్థిక మాంద్యం ఒకవైపు బుసలు కొడుతుంటే..మరోవైపు అమ్మకాలు పడిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటోమొబైల్ సంస్థలకు ఊరట లభించబోతున్నాదా అంటే వచ్చే శుక్రవారం వరకు ఆగాల్సిందే మరి. ఈ నెల 20న గోవా కేంద్రస్థానంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగబోతున్నది. కార్ల నుంచి బిస్కెట్ల వరకు ఉత్పత్తి చేస్తున్న సంస్థలు పన్నులు తగ్గించాలని డిమాండ్ చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ సమావేశం జరుగుతుండటం మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఒకవేళ పన్నురేట్లు తగ్గిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ఆదాయం కోల్పోవాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఈ సమావేశానికి రాష్ర్టాల ఆర్థిక మంత్రులు హాజరవనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీయ వృద్ధిరేటు ఆరేండ్ల కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో కేంద్ర ప్రభుత్వం పలు కీలక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఆటోమొబైల్, ఎఫ్‌ఎంసీజీ నుంచి హోటల్ రంగాల వరకు పన్నును తగ్గించాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. జీఎస్టీ అమలులోకి వచ్చిన నాటి నుంచి గత నెల చివరివరకు పరిహారం సెస్ కింద రూ.1,98,963 కోట్లు వసూలవగా, వీటిలో రూ.1,75,572 కోట్లను పలు రాష్ర్టాలకు చెల్లించగా, మిగతా 23,391 కోట్లు చెల్లించాల్సి ఉన్నదని ఆ వర్గాలు వెల్లడించాయి.

195
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles