క్విడ్ కార్లు మరింత ప్రియం

Tue,March 26, 2019 12:21 AM

2019 Renault Kwid To Cost More From April 2019

-3 శాతం ధరల్ని పెంచిన సంస్థ

న్యూఢిల్లీ, మార్చి 25: క్విడ్ కార్ల ధరలను మూడు శాతం వరకు పెంచుతున్నట్లు ఫ్రెంచ్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ రెనో ప్రకటించింది. మూలధన వ్యయం పెరుగడం వల్లనే ధరలను పెంచాల్సి వచ్చిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ పెరిగిన ధరలు వచ్చే నెల 1 నుంచి అమలులోకిరానున్నట్లు తెలిపింది. ప్రస్తుతం సంస్థ రూ.2.66 లక్షలు మొదలుకొని రూ.4.63 లక్షల లోపు ధర కలిగిన క్విడ్ మోడళ్లను దేశవ్యాప్తంగా విక్రయిస్తున్నది. సంస్థ ఇటీవల క్విడ్ విభాగ కార్లను అప్‌గ్రేడ్ చేసింది. ముఖ్యంగా భద్రత ప్రమాణాలను మెరుగుపరుచడానికి ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్‌తో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్ వంటివి ఏర్పాటు చేసింది. గతవారంలో టాటా మోటర్స్ ప్యాసింజర్ వాహనాల ధరను రూ.25 వేల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.

709
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles