51 మంది.. 17,947 కోట్లు

Wed,December 4, 2019 12:35 AM

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: 51 మంది మోసగాళ్ల వల్ల రూ. 17,900 కోట్లకుపైగా నష్టాలు వాటిల్లాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. మంగళ వారం రాజ్యసభలో పరారీ ఆర్థిక నేరగాళ్లు, మోసాలకు సంబంధించిన వివరాలను ఆయన లిఖితపూర్వకంగా తెలియజేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ సమాచారం మేరకు 66 కేసుల్లో 51 మంది మోసగాళ్లు విదేశాలకు పరారైనట్లు చెప్పారు. ఈ కేసుల్లో ఈ పరారీ ఆర్థిక నేరగాళ్ల వల్ల జరిగిన మోసాల విలువ దాదాపు రూ. 17,947.11 కోట్లుగా ఉన్నదన్నారు. 8 మంది కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నదని, వీరిపై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసులనూ ఇచ్చిందని తెలియజేశారు.

184
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles