అచ్చిరాని ప్రైమరీ మార్కెట్

Fri,November 9, 2018 12:44 AM

10 of 15 newly listed firms trade below IPO price in FY19

15 సంస్థల్లో పదింటికి నష్టాలే
న్యూఢిల్లీ, నవంబర్ 8: స్టాక్ మార్కెట్లో లిైస్టెన సంస్థలకు ఈసారి నిరాశే ఎదురైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఐపీవోకి వచ్చిన 15 సంస్థల్లో పది భారీగా నష్టపోయాయి. స్టాక్ మార్కెట్లో లిైస్టెన నాటి నుంచి ఇప్పటి వరకు ఇష్యూ ధర కంటే 53 శాతం వరకు పడిపోయ్యాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఐపీవోకి 15 రాగా, పెట్టుబడిదారుల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉండటంతో దినేష్ ఇంజినీరింగ్ మధ్యలోనే తప్పుకున్నది. దీపావళి సందర్భంగా నిర్వహించిన మూరత్ ట్రేడింగ్ వరకు ఐపీవోకి వచ్చిన పది సంస్థల షేర్లు 0.5 శాతం నుంచి 53 శాతం వరకు పతనం చెందాయి. వీటిలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అత్యంత పేలవమైన ప్రదర్శణగావించింది. కంపెనీ షేరు ధర ఏకంగా 53.20 శాతం క్షీణించింది. ఏప్రిల్‌లో స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఐసీఐసీఐ సెక్యూరిటీస్ భారీ స్థాయిలో నిధులను సమీకరించింది.

వీటితోపాటు ఇండోస్టార్ క్యాపిటల్ ఫైనాన్స్ 45.39 శాతం తగ్గింది. ఐపీవోకి వచ్చిన సమయంలో కంపెనీ షేరు రూ.572 వద్ద ఉండే. స్టాక్ మార్కెట్లో అనిశ్చిత పరిస్థితి నెలకొనడం, పెట్టుబడిదారుల్లో సెంటిమెంట్ మందకొడిగా ఉండటం ఇందుకు ఉదాహరణలు. ఈ పదిహేనింటిలో ఐదు కంపెనీల షేర్లు 46 శాతం వరకు రిటర్నులు పంచాయి. వీటిలో ప్రభుత్వరంగ సంస్థయైన రైల్వే కన్సల్టెన్సీ విభాగం రిట్స్ 45.94 శాతం లాభపడింది. అలాగే కెమికల్ తయారీదారు ఫైన్ ఆర్గానిక్ ఇండస్ట్రీస్ కూడా 42.91 శాతం రిటర్నుల పంచింది. దేశ ఆర్థిక వ్యవస్థపై ఆందోళన నెలకొనడంతో ఈ ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటి వరకు బీఎస్‌ఈ బెంచ్‌మార్క్ సెన్సెక్స్ 3,407.39 పాయింట్లు లేదా 8.81 శాతం దిగువకు పడిపోయింది.

320
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles